పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రతికివున్న దుర్మార్గుని ఖండిస్తాడు
స్వల్పకాలంలోనే సిద్థిని పొందిన యువకుడు
దీర్ఘకాలం జీవించే వృద్ధపాపిని గేలిచేస్తాడు - సాలోమోను జ్ఞాన 4,8-16

20. ధర్మశాస్త్ర బోధకుడు

     ధర్మశాస్త్ర బోధకుడు మోషే ధర్మశాస్రాన్ని చక్కగా అధ్యయనంచేసి దాన్ని ప్రజలకు బోధిస్తాడు. అతడు ఎల్ల యెడలా జ్ఞానాన్ని వెదజల్లుతాడు. కనుక అతని జీవితం ధన్యమైంది. నేటి మన బోధకులుగూడ ఇతనిలా జీవిస్తే ఎంత బాగుంటుంది!

మహోన్నతుని ధర్మశాస్తాన్ని పఠించడంలో కాలంగడి పే
ధర్మశాస్త్ర బోధకుడు మాత్రం భిన్నమైనవాడు
అతడు పురాతన రచయితల జ్ఞానవాక్కులను పరిశీలిస్తాడు
ప్రవచనాలను పఠించడానికి కాలం వినియోగిస్తాడు
సుప్రసిద్దుల సూక్తులను పదిలపరుస్తాడు
ఉపమానాలమీద నైపుణ్యంతో వ్యాఖ్య చెప్తాడు
సామెతల గూఢార్ధాన్ని అర్థంచేసికొంటాడు
పొడుపు కథల మర్మాన్ని చర్చిస్తాడు
ప్రముఖులకు సేవలుచేస్తూ
రాజులతో కలసి తిరుగుతాడు
అన్యదేశాలలో సంచరించి
నరుల బాగోగులను పరిశీలిస్తాడు
వాడుక చొప్పన వేకువనే లేచి
తన్ను సృజించి దేవునికి జపం చేస్తాడు
మహోన్నతుడైన దేవుని ముందట గొంతెత్తి ప్రార్ధనచేసి
తన పాపాలను మన్నింపమని వేడుకొంటాడు
ఆ మహాప్రభువు కరుణిస్తే
అతని హృదయం విజ్ఞానంతో నిండుతుంది
అతడు జ్ఞానవాక్కులను వెదజల్లుతూ
దేవునికి కృతజ్ఞతాస్తుతులూ చెల్లిస్తాడు
తన విజ్ఞానాన్నీ ఉపదేశాన్నీ అన్యులకు పంచిపెడతాడు
నిగూఢమైన దేవరహస్యాలను అర్థం జేసికొంటాడు