పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19. వయస్సుకంటె జ్ఞానం ముఖ్యం

  ఎన్నేళ్లు జీవించామన్నది ముఖ్యంకాదు. ఎంత జ్ఞానంతో, ఎంత నిర్మలంగా జీవించామన్నది ముఖ్యం. సజ్జనుడు కొద్దికాలమే జీవించినా ఆ స్వల్పకాలంలోనే పరిపూర్ణతను పొంది దీర్ఘకాలం జీవించినవాడౌతాడు. ప్రభువు మంచివారిని చెడ్డనుండి కాపాడ్డంకోసం త్వరలోనే తీసుకపోతాడు,

దీర్ఘకాలం జీవించడంవల్లనే గౌరవం కలగదు
పెక్కేండు బ్రతకడంవల్లనే జీవితం సార్థకంకాదు
జ్ఞానార్ధనమే తల నరవడానికి గుర్తు
నిర్మల జీవితమే వృద్ధత్వానికి చిహ్నం
ప్రభువుకి ప్రీతికలిగించిన పుణ్యపురుషుడు ఒకడున్నాడు
దేవుడు అతన్ని ప్రేమించాడు
అతడు పాపాత్ముల నడుమ వసిస్తూంటే
ప్రభువు అతన్ని పరలోకానికి కొనిపోయాడు
చెడుగు ఆ సజ్జనుని మనస్సు పాడుచేసేదే
దుష్టత్వం ఆ సత్పురుషుని హృదయాన్ని చెరచేదే
కనుక ప్రభువు అతన్ని ముందుగానే తీసుకపోయాడు
చెడగు నరులను మభ్యపెట్టి
వాళ్ళ మంచిని గుర్తించకుండా వుండేలా చేస్తుంది
వ్యామోహాలు మంచివారి హృదయాలనుగూడ చెరుస్తాయి
కాని ఆ సజ్జనుడు స్వల్పకాలంలోనే సిద్ధిని పొంది
దీర్ఘకాలం జీవించినవా డయ్యాడు
ప్రభువు సత్పురుషుని వలన ప్రీతిజెంది
అతన్ని పాప ప్రపంచం నుండి సత్వరమే కొనిపోయాడు
ప్రజలకు అతని మరణాన్నిగూర్చి తెలిసినా
వాళ్ళ విషయాన్ని అర్థం చేసికోలేదు
సత్యం వారి తలకెక్కలేదు
ప్రభువు తన భక్తులకు కృపను దయచేస్తాడనీ
వారిని కాచి కాపాడతాడనీ ప్రజలు గ్రహించలేదు
చనిపోయిన పుణ్యపురుషుడు