పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవి పరస్పర విరుద్దాలైన ద్వంద్వాల్లా కన్పిస్తాయి
నా మట్టుకు నేను పనివారిలో కడపటివాణ్ణి
నేను ద్రాక్షపండ్లు కోసే పనివారి వెనుక
పరిగలేరుకొనేవానివలె పని ప్రారంభించాను
కాని దేవుని దీవెనవల్ల ఆ పనివారినెల్ల మించాను
వారివలె నేను నా ద్రాక్షతొట్టిని రసంతో నింపాను
నా కొరకు మాత్రమే నేనీ శ్రమనంతా చేయలేదు
ఉపదేశాన్ని ఆశించేవాళ్ళందరి కొరకు ఈ కృషి చేసాను. - సీరా 33,10-17.

18. నరుడు తన్ను తాను అదుపులో పెట్టుకోవాలి

నరుడు తన్ను తాను అదుపులో పెట్టుకోవాలి. నగరాన్ని జయించడంకంటె తన్నుతాను గెల్వడం మేలు. వినయంతో మన దుర్గణాలను మనం సవరించుకోవాలి.

ఓర్పుగలవాడు వీరునికంటె ఘనుడు
నగరాన్ని జయించడంకంటె
తన్నుతాను గెల్వడం లెస్స
తన్నుతాను అదుపులో పెట్టుకోలేనివాడు
ప్రాకారాలు లేనందున రక్షణను కోల్పోయిన
నగరంలాంటివాడు.
రేపటి దినాన్నిగూర్చి ప్రగల్భాలు పలకవద్దు
నేడేమి జరుగుతుందో నీకే తెలియదు
ఇతరులు నిన్ను పొగడవచ్చుగాని
నిన్ను నీవే పొగడుకోగూడదు
పరులు నిన్ను స్తుతించవచ్చుగాని ఆత్మస్తుతి కూడదు
రాయి బరువు, ఇసుక బరువు,
కాని మూర్జుని వలన కలిగే బాధ
వీటికంటె ఎక్కువ బరువు
కోపం క్రూరమూ వినాశప్రదమూ ఐంది
కాని అసూయ దానికంటె ఘోరమైంది - సామె 16,32, 25,28, 27, 1-4.