పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2,7. దివ్యసత్ర్పసాదమేగాదు వాక్యంగూడ క్రైస్తవులకు భోజనమే. కనుక మొదట వాక్యాన్ని భుజించి తర్వాత దివ్య సత్రసాదాన్ని భుజించడం యుక్తం. అందుకే పూజలో ప్రసంగానికి ప్రముఖమైన స్థానముంది.

బోధకులు ప్రధానంగా బిషప్పలు. పాపుగారును బిషప్పలును కలసి బోధక తిరుసభ ఔతారు. గురువులు దానిలో భాగంగాదు. ఐనా బిషప్ప గురువుని అభిషేకించినపడే తన బోధనాధికారంలో అతనికి పాలు ఇస్తాడు. కనుక గురువకూడ ప్రముఖంగా బోధకుడే.

గురువు క్రైస్తవులకూ క్రైస్తవేతరులకూ గూడ బోధించవచ్చు. అతడు అందరినీ పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి రమ్మని ఆహ్వానించాలి.

అతడు దైవవాక్యాన్ని సమకాలిక సమస్యలకు అన్వయించి చూపిస్తూండాలి. కేవలం లౌకికాంశాల్లాగ కన్పించే విషయాలకుకూడ భగవంతునితో సంబంధం వుంటుంది. గురువు తనబోధలో ఈ సంబంధాన్ని స్పష్టంగా చూపించగలిగి వుండాలి. అప్పుడేగాని అతడు ఈ భౌతిక ప్రపంచాన్ని దేవుని కర్పించడు. ఇక, ఇతరులకు బోధించకముందు గురువు వేదవాక్కునూ క్రైస్తవ సత్యాలనూ గంటల తరబడి మననం చేసికొనివుండాలి.

3) ప్రజలను పరిపాలించే అధికారం

క్రీస్తు పాలకుడు, కాపరి. అతని పాలనాధికారంలో పాలు పొంది గురువు కూడ మందను నడిపించేవాడవుతాడు. ఈ యధికారాన్ని అతడు క్రీస్తు నుండి బిషప్పుద్వారా పొందుతాడు.

క్రైస్తవ సమాజాలను నిర్మించడం గురువుపని. అతడు తిమోతిలాగే “సహనంతో కూడిన బోధతో ప్రజలను ఒప్పిస్తూ, ఖండిసూ, ప్రోత్సహిస్తుండాలి" - 2తిమో 4,2. పేత్రు చెప్పినట్లుగా "గురువు అనిష్టంతోగాక దేవుని చిత్తం అనుకొని ఇష్టపూర్తిగా మందను మేపాలి. దుర్గాభఆపేక్షతో గాక మనఃపూర్వకంగా దానిని కాయాలి. తన ఆధీనమందున్న వారిపై అధికారం చలాయించక మందకు మాదిరిగా వుండాలి." అలా చేస్తే ప్రధానకాపరి ప్రత్యక్షమైనపుడు గురువు మహిమాన్వితమైన కిరీటాన్ని పొందుతాడు - 1పేత్రు 5,2-4.

గురువులు ప్రతివానిని దేవుడు వానికి నిర్ణయించిన మార్గంలో నడిపింప గలిగివుండాలి. ప్రజలకు సోదరప్రేమ, సువిశేష బోధల ప్రకారం జీవించడం, ఇతరులకు సేవచేయడం మొదలైన క్రైస్తవ విలువలను నేర్చాలి. గురువు విశేషంగా పేదలనూ రోగులనూ చనిపోయేవాళ్ళనూ యువజనులనూ మఠవాసులనూ పరామర్శిస్తుండాలి. ప్రాత క్రైస్తవులను అశ్రద్ధ చేయకుండా నూత్న క్రైస్తవులను ఎక్కువ శ్రద్ధతో పట్టించుకోవాలి.