పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. త్రివిధాధికారాలు

ఇక గురువు మూడధికారాలను పరిశీలిద్దా.

1) ప్రజలను పవిత్రపరచే అధికారం.

క్రీస్తు యాజకుడు. గురువు క్రీస్తు యాజకత్వంలో పాలుపొంది అతనితో ఐక్యమై దివ్యసత్రసాదబలి నర్పిస్తాడు. ఈ బలిద్వారా అతడు ప్రజలను పవిత్రపరుస్తాడు. ఇంకా జ్ఞానస్నానం పాపోచ్చారణం భద్రమైన అభ్యంగనం మొదలైన సంస్కారాలద్వారాగూడ వాళ్ళను పవిత్రపరుస్తాడు. కాని క్రైస్తవ ప్రజలు గురువుతోపాటు సత్రసాదబలి నర్పించడం ద్వారా ప్రేమలో ఎక్కువగా పెంపజెందుతారు.

గురువు భగవంతునికీ నరునికీ మధ్య నిలచి దేవుణ్ణి నరుని చెంతకు తీసికొనివస్తాడు. నరుజ్జీ, ఈ లోకాన్నంతటిని దేవుని చెంతకు తీసికొనిపోతాడు. ఈలా అతడు తన మధ్యవర్తిత్వంద్వారా మానవులను పునీతులను చేస్తాడు.

ఇంకా గురువు రోజూ ఓ 45 నిమిషాలపాటు డివైన్ ఆఫిస్ అనే ప్రార్ధనం జపిస్తాడు. ఈ ప్రార్థన స్తుతిబలి. అది అతడర్పించే దివ్యసత్రసాద బలితో కలసిపోతుంది. ఈ ప్రార్థనను అతడు తిరుసభ పేరుమ్మిదిగాను, ప్రపంచంలోని ప్రజలందరి పేరుమిదిగాను జపిస్తాడు. ఈ స్తుతిబలి క్రీస్తు మోక్షప్రార్ధనంతో ఐక్యమై (హెబ్రే 7,25) ప్రజలను పవిత్రపరుస్తుంది. ఈ విధంగా అతని ఆరాధనజీవితం, విశేషంగా పూజర్పణం క్రైస్తవులను పునీతం చేస్తుంది.

2) ప్రజలకు బోధచేసే అధికారం.

క్రీస్తు మహాప్రవక్త గురువు అతని ప్రవక్తృత్వంలో పాలుపొంది బోధకుడౌతాడు. క్రీస్తు పాస్క పరమరహస్యమైన దివ్యసత్రసాదబలినిగాని, ఇతర దేవద్రవ్యానుమానాలను కాని, అసలు దైవసంబంధమైన విషయాలు వేటినైనగాని అర్థంచేసికోవాలంటే వాక్యబోధ, జ్ఞానోపదేశం అనవసరం. వాక్యబోధ మలనకాని తిరుసభను నిర్మించలేం. కనుక గురువులు విూరు ప్రపంచమంతట తిరిగి సువార్తను బోధించండి అన్న ప్రభువు పలుకుల ప్రకారం నిరంతరం వాక్యబోధ చేస్తూండాలి. నరులు క్రీస్తు బోధనువినివిశ్వసించందే వారికి రక్షణంలేదు-మార్కు 16,15-16. వాక్యబోధ వలనగాని క్రైస్తవ సమాజాలు ఏర్పడవు. వినడం వలనకాని విశ్వాసం కలుగదు. బోధకులు క్రీస్తునిగూర్చి బోధిస్తేనేగాని ప్రజలు వినడమనేది జరగదు - రోమా 10,17. అందుచేత వాక్యబోధచేయడం గురువు ప్రధాన బాధ్యతల్లో వొకటి. దేవుని గూర్చిన జ్ఞానాన్ని బోధించడం యాజకుని బాధ్యత - మలాకీ