పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వం మోషే యోషువామిూద చేతులు చాచి తన అధికారాన్నీ జ్ఞానాన్నీ యోషువాకు అందించాడు. దీనివల్ల యోషువా అతనికి ఉత్తరాధికారి యయ్యాడు - సంఖ్యా 27, 18–20, ద్వితీ 349.

ఈలాగే మోషే డెబ్బదిమంది పెద్దలను నియమించినపుడు వాళ్లమిద చేతులు చాచాడు. అప్పడు ప్రభువు తాను పూర్వం మోషేకిచ్చిన ఆత్మలో కొంత తీసికొని ఆ డెబ్బదిమంది పెద్దలకు ఇచ్చాడు-సంఖ్యా 11,25,

ఈ యాలోకనాలన్నిటినిబట్టి హస్తనిక్షేపణం ఆత్మను పొందడానికి గుర్తు అనుకోవాలి. కనుక బిషప్ప గురువు కాబోయే అభ్యర్థిపై చేతులు చాచినపుడు అతడు ఆత్మను పొందుతాడు.

బిషప్పతోపాటు ఇతర గురువులు కూడ అభ్యర్థిపై చేతులు చాస్తారు. కాని అభ్యర్థి ఈ గురువులనుండి ఆత్మను పొందడు. ఈ క్రియ గురువులంతా కలసి ఓ బృందంగా కూడి పనిచేస్తారనడానికి సూచనం.

2. బిషప్ప ప్రార్ధనం

బిషప్పగారు గురుపట్టం పొందే అభ్యర్థిపై కుడిచేయి చాచివుంచి ఈలా అర్ధిస్తారు. "సర్వశక్తిగల పితా! ఈ మిూ సేవకునికి గురుత్వపు ఘనతను ప్రసాదించండి. ఇతని హృదయంలో పవిత్రాత్మ శక్తిని నూతీకరించండి. దీనివలన ఇతడు విూనుండి ఆచార్యత్వంలో రెండవ అంతస్తును పొందునుగాక. నిగ్రహజీవితమును అలవర్చుకొని తన సత్ర్పవర్తనము వలన అందరికి ఆదర్శముగా నుండునుగాక" పై హస్తనిక్షేపణం ద్వారాను ఈ ప్రార్ధనంద్వారాను అభ్యర్థి గురువుగా మారిపోతాడు. ఈ రెండు సంజ్ఞల్లోను ఆత్మను పొందడమే ముఖ్యాంశం. ఈ యాత్మశక్తి వల్లనే గురుత్వం లభించేది.

3. గురుపట్ట సంస్కారాన్నిచ్చేది బిషప్పే

మామూలుగా గురుపట్టాన్నిచ్చేది బిషప్పగారే. కాని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొందరు పాపగార్లు బిషప్పలు కాని మఠశ్రేషులకు కూడ గురుపట్టాన్నిచ్చే అధికారాన్ని ఒసగారు. కనుక అరుదుగా, ప్రత్యేకానుమతితో గురువులుకూడ గురుపట్టాన్నీయవచ్చు.

గురువును అభిషేకించడానికి ఒక్క బిషప్ప చాలు కాని బిషప్పని అభిషేకించడానికి మాత్రం ముగ్గురు బిషప్పలు కావాలి. వారిలో వొకరు ప్రధానాభిషేకకుడుగావున్నా ఆ ముగ్గురు కలసే నూత్న బిషప్పను అభిషేకిస్తారు. నాల్గవ శతాబ్దంనుండి ఈ నియమం అమలులో వుంది.