పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లూతరు, కాల్విన్, మొదలైన ప్రోటస్టెంటు నాయకులు గురుపట్టం దేవద్రవ్యానుమానం కానేకాదన్నారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం క్రీస్తు గురుపట్టాన్ని స్థాపించలేదు. క్యాతలిక్ సమాజమే దాన్ని ప్రవేశపెట్టింది. కనుక దాన్ని నిరాకరించాలి.

ఈ ప్రోటస్టెంటు వాదాలను ఖండించి మన తిరుసభ ఈలా బోధించింది. క్రైస్తవులందరూ జ్ఞానస్నానం ద్వారానే క్రీస్తు యాజకత్వంలో పాలు పొందుతారు. కాని ఇదికాక క్రైస్తవుల్లో కొందరికి సేవాత్మకమైన యాజకత్వం గూడ వుంటుంది. దీన్నేగురుపట్టం అంటాం. దీన్ని క్రీస్తు ఏడు దేవ ద్రవ్యానుమానాల్లో ఒకటిగా స్థాపించాడు.

సేవాత్మకమైన యాజకత్వం ఈలోకంలో క్రీస్తు కల్వరిబలిని కొనసాగించుకొని పోవడానికి ఉద్దేశింపబడింది. ఈ యాజకత్వం విశ్వాసులకు సేవచేయడానికిగాని వారిపై పెత్తనం చలాయించడానికి గాదు. తిరుసభలో విశ్వాసులున్నారు కనుకనే క్రీస్తు వారి సేవార్థమై యాజకత్వాన్ని గూడ నెలకొల్పాడు.

గురువుల యాజకత్వం విశ్వాసులు జ్ఞానస్నానం ద్వారా పొందే యాజకత్వాన్ని భంగపరుపదు. పైగా అది విశ్వాసులకు సేవలు చేయడానికే ఉద్దేశింపబడింది. ఈ యాజకత్వం ఉత్తాన క్రీస్తు యాజకత్వంలో ఓ పాలే కాని స్వతంత్రమైంది కాదు. కనుక అది క్రీస్తు యాజకత్వాన్ని గూడ భంగపరుపదు.

{{center

3. గురుపట్ట సంజ్ఞలు

}}

ఈ యధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.

గురుపట్ట సంజ్ఞలు రెండు. అవి బిషప్పగారి హస్తనిక్షేపణం, ప్రార్ధనం, గురుపట్టాన్నిచ్చేది బిషప్పగారే.

1. బిషప్పగారి హస్తనిక్షేపణం

బిషప్పగారు గురుపట్టాన్ని పొందేవ్యక్తిపై చేతులు చాస్తారు. ఈ హస్తనిక్షేపణం భావం ఏమిటి?

తిమోతి పౌలునుండి యాజకత్వాన్ని పొందినపుడు పౌలు ఇతర పెద్దలు అతని విూద చేతులు చాచారు - 2 తిమో 1,6-7; 1తిమో 4,14. ఈ సంజ్ఞద్వారా తిమోతి పవిత్రాత్మను స్వీకరించాడు. అతడు దేవుని వరాన్ని ఆధ్యాత్మిక వరాన్ని పొందాడు. ఈవరం పవిత్రాత్మే తిమోతి కూడ తానెన్నుకొనిన అభ్యర్థులపై చేతులుచాచి వారిని యాజకులను చేసాడు -1తిమో 5,22 ఈలాగే అపోస్తలులు సైఫను మొదలైన వారిపై చేతులు చాచి వారిని డీకన్లను చేసారు - అ,చ. 6,6.