పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బళ్ళు మొదలైన తావుల్లో పనిజేసికొంటూంటారు గృహస్తులు. మంచి ఉద్దేశంతో చేస్తే ప్రపంచంలోని ఏపనైనా వాళ్ళను పవిత్రపరుస్తుంది. కావున గృహస్థలు నిజాయితీతో ఈ పనులనుజేసి ప్రభువునకు అర్పిస్తుండాలి. అరవై డెబ్భయియేండ్ల జీవించేపుడు, ఈ పనులే మనలను పునీతులనుజేయాలి. అవి దేవుని యెదుట మనకు సాక్ష్యం పలకాలి. ఇక "భూమండలమంతట నివసించి దానిని వశం చేసికొనండి" "నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకొనండి" అన్న భగవద్వాక్యాలు వుండనే ఉన్నాయి - ఆది 1,28, 3,19.

4. పావనాత్మ

పితసుతులను ఐక్యపరచేది, ముగ్గురు వ్యక్తులు ఒక్క దేవుడయ్యేలా చేసేది పావనాత్మ. ఈయాత్మ ప్రేమజలాన్ని మన హృదయంలో కుమ్మరిస్తుంది - రోమా 5,5. కుటుంబంలోని వాళ్ళంతా కూడిమాడి ప్రేమజీవితం గడిపేలా చేసేది ఈయాత్మే. ఈయాత్మ ప్రత్యక్షమై వున్నచోట సిలువ వుంటుందిగాని అది భారమనిపించదు. కావున గృహస్తులు ఈ యాత్మపట్ల భక్తిభావంతో మెలుగుతూండాలి.

గృహస్థులు పవిత్రులయ్యే మార్గాలు రెండు. ప్రేమమార్గం, సిలువమార్గం. వివాహితులు సాధారణంగా తొలిరోజుల్లో ప్రేమమార్గంలో నడచిపోతారు. కడపటి రోజుల్లో సిలువమార్గంలో సాగిపోతారు.

ప్రార్థనా భావాలు

1. బలిపీఠం

వధూవరులు తమ క్రొత్త జీవితపు తొలి రోజుననే బలిపీఠంముందు సమావేశమౌతారు. ఆ పీఠం ముందు, దాని మీది సిలువయెదుట, ప్రభుసమక్షంలో భార్యాభర్తలుగా మారిపోతారు. ఆనాటినుండి ప్రభువు సిలువ వారిపై సోకుతూనే వుంటుంది. ఒకోమారు వాళ్ళమీద భారంగా వాలుతుంది. ఐనా ఈ పీఠంమీది దైవసాన్నిధ్యం వారి . జీవితంలోగూడ నెలకొని వుంటుంది. తొలిరోజే ఈ పీఠంముందు విందులో భార్యాభర్తలు పాలుపొందుతారు. మల్లా మోక్షవిందులో పాల్గొనేదాక యీ విందు దంపతులను ముందుకు నడుపుతూంటుంది,

2 కష్టసుఖాలు

కుటుంబజీవితంలో కష్టసుఖాలు కావడికుండల్లా మారుతూంటాయి. ఐనా సుఖదుఃఖాల్లోను, శీతోష్ణాల్లోను మనలను భరించేది ఆ ప్రభువే. కావున దంపతులు