పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తోడి నరులనుగూడ ఆదరించి సోదరప్రేమను పెంచుకొంటారు. ఈ విధంగా ఆలుమగల్లో దివ్యప్రేమ వృద్ధి చెందుతుంది.

భార్యాభర్తల ప్రేమలోని ముఖ్యాంశం ఆత్మార్పణం. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తమ్ముతాము సమర్పించుకోవాలి. తమ ప్రేమను వట్టిమాటల్లోకాక చేతల్లో చూపించాలి. ఒకరికొకరు ఎంత త్యాగమైనా చేయాలి. భర్త క్రీస్తుని పోలి భార్యకొరకు తన ప్రాణాన్నికూడ సమర్పించాలి. భార్య తిరుసభనుపోలి కృతజ్ఞతా భావంతో భర్త ప్రేమను అంగీకరించి సంతానవతి కావాలి.

దంపతులు తొలిరోజుల్లో శారీరకప్రేమతోనే తృప్తి జెందుతారు. కాని ఈ ప్రేమ ఎంతోకాలం నిలవదు. ఈ ప్రేమ సమసిపోయాక వాళ్లు ఒకరినొకరు నిరాకరింపగూడదు. ఉన్నవాలళ్ళు ఉన్నట్లుగా - అనగా లోపాలతోపాటు సద్గుణాలతోపాటు ఒకరినొకరు ఓర్పుతో అంగీకరించాలి. ఇరువురూ ఒకరిలో దాగివున్న మంచితనాన్నీ శక్తిసామర్థ్యాలను ఒకరు వెలికితీయాలి. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో పాల్గొనడంద్వారా వారి ప్రేమ క్రమేణ పెరుగుతుంది.

వివాహ ప్రేమ క్రీస్తు తిరుసభలను పోలివుండడం దివ్యమైంది. ఒకరి విలువను ఒకరు అంగీకరించడంద్వారా వ్యక్తి సంబంధమైంది. ఒకరినొకరు పవిత్రపరచుకోవడం ద్వారా పునీతమైంది. సంతానాన్ని కనడంద్వారా ఫలభరితమైంది.

3. సంతానాన్ని కోరే ప్రేమ

వివాహపేమ సంతానంకొరకు ఎదురుచూస్తుంది. బిడ్డలను గాఢంగా వాంఛిస్తుంది. సంతానాన్ని ఆశించని ఆలుమగల ప్రేమ వంధ్యాత్వంతో నిండివుంటుంది. అలాంటి ప్రేమగల భార్యాభర్తలు ఒకరికొకరు సమర్పించుకోరు. నిరంతరం ఒకరినొకరు స్వార్థానికి వాడుకొంటారు. లైంగికానందమే ముఖ్యమనుకొంటారు. బిడ్డలనుకాక కేవలం లైంగికానందాన్నే కోరుకొనే ప్రేమ నింద్యమైంది. పూర్వవేద ప్రవక్తలు యావే ప్రభువుకి యిప్రాయలీయులపట్లగల ప్రేమను భార్యాభర్తల ప్రేమతో పోల్చారు. నూత్నవేదంలో క్రీస్తుకి తిరుసభపట్లగల ప్రేమ దంపతుల ప్రేమకు ఆదర్శం. ఈ దైవప్రేమలు రెండూ ఫలభరితమైనవి. యావే ప్రభువూ క్రీస్తూ ప్రజల రక్షణకొరకు పాటుపడ్డారుకదా! ఈ దివ్యప్రేమలను పోలిన మన వివాహ ప్రేమకూడ ఫలభరితం కావాలి.

సంతానాన్ని కనడమంటే దేవుని సృష్టిని కొనసాగించడం. ఒకవిధంగా చెప్పాలంటే, ప్రతిసృష్టి చేయడం. భగవంతుని సృష్టి అద్భుతంగా వుంటుంది. అన్నంలో