పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసే గొప్పకార్యాలేవీ లేకపోవచ్చు. మన వూరికి వెలుపల మన పేరు తెలిసినవాళ్ళ ఎవరూ ఉండకపోవు. ఐనా నిరుత్సాహపడవలసిన అవసరమేమీలేదు. రోజురోజుకీ మనం జీవించే సామాన్య జీవితమే, రోజురోజుకీ మనం చేసికొనే మామూలు పనులే మనలను పవిత్రులను జేయగలవు. మనలను దేవుని పత్రులనుజేసి భావి మహిమకు పట్టానీయగలవు. కావలసినదంతా, క్రీస్తుతో ఐక్యమై సదుద్దేశంతో ఆయా పనులు చేసికొంటూ పోవడమే.

ఓ పసిబాలుడు. ఇంటి ప్రక్కనున్న రాతిని కదిలించాలని తన చిన్న చేతులతో నెట్టాడు. వాడికి ముచ్చెమటలు పోసాయి. కాని రాయేమో కదల్లేదు. అంతలో ఆ పసిబిడ్డ తండ్రి కుమారుని ప్రయత్నం గమనించి రాతి దగ్గరకు వచ్చాడు. "అది నీకు కదుల్లుందా! నన్నెందుకు పిల్చావు గావు?" అని కుమారుడ్డి మందలించాడు. తన బలమైన చేతులను ఆ పసిబిడ్డ బలహీనప చేతులతో జోడించి రాతిని అవలీలగా అవతలకు నెట్టివేసాడు. మన విషయమూ ఇంతే క్రీస్తుతో ఐక్యం గానంత వరకూ మన యీ దరిద్ర జీవితమూ, జిగేలు మనిపింపని మన యీ మామూలు పనులూ చాల భారమనిపిస్తాయి. కాని ప్రభువు చేయిస్తే చాలు, ఈ భారపు రాతిని సునాయాసంగా ప్రక్కకు నెట్టివేయగలం. క్రీస్తు మనతో మనం క్రీస్తుతో ఐక్యం గావడమంటే యిదే.

ప్రార్ధనా భావాలు

1. క్రీసోస్తం భక్తుడు ఈలా వాకొన్నాడు. “మట్టితో కలసివున్న ముడిలోహాన్ని కొలిమిలో కరిగించి బంగారం తయారుచేస్తారు. ఆలాగే జ్ఞానస్నానం మట్టిముద్దలమైన మనలను బంగారంగా మారుస్తుంది. జ్ఞానస్నాన సమయంలో ఆత్మ అగ్నితో మనలోకి దిగివచ్చి మనలోని ప్రాపంచిక మానవుని కాల్చివేసి ఆధ్యాత్మిక మానవుని వెలుపలికి తెస్తుంది." అనగా జ్ఞానస్నాన సమయంనుండి మనలో వరప్రసాదం పనిచేయడం ప్రారంభిస్తుంది. H 2. క్రీస్తు వరప్రసాదాన్ని గూర్చి ట్రెంటు మహాసభ "శిరస్సు ప్రాణాన్ని అవయవాలలోనికి వలె, తీగ సారాన్ని రెమ్మలలోనికివలె, క్రీస్తు తన వరప్రసాదాన్ని మన ఆత్మలోనికి ప్రసరింపజేస్తుంటాడు" అని బోధించింది. దేహానికి జీవమిచ్చేది శిరస్సు కొమ్మలకు జీవమిచ్చేది తల్లితీగ. క్రైస్తవులకు జీవమిచ్చేది క్రీస్తు.

3. వరప్రసాదం దేవుడు మనకు ఉచితంగా యిచ్చే వరం. కేవలం మన పుణ్యక్రియలద్వారా మనం దాన్ని సంపాదించలేం. మనం అంతస్తు వేరు, వరప్రసాదం అంతస్తువేరు. కనుక మనకు దానిమీద ఏలాంటి హక్కు లేదు. ప్రభువు తన కృపద్వారా మనలను ఎన్నుకొంటాడుగాని మనంచేసే సత్ర్కియాలద్వారా కాదు - రోమా 11,6.