పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. "తిరుసభ సేవంతాగూడ మాటలద్వారా నైతేనేమి చేతలద్వారా నైతేనేమి క్రీస్తు సందేశాన్ని లోకానికి వెల్లడిచేసి అతని వరప్రసాదాన్ని ప్రజలకు పంచిపెట్టడమే” అంటుంది రెండవ వాటికన్ మహాసభ వరప్రసాదంతో నిండివున్న మానవులు ఇతరులకు గూడ వరప్రసాదాన్ని అందిస్తారు. కనుక మొదట మనతరపున మనం వరప్రసాద మానవులంగా తయారుకావాలి.

10. సత్ర్కియలు

దినదినము మనము చేసే సత్కార్యాల ద్వారా కూడ క్రీస్తు కృపను పొందుతూంటాం. ప్రస్తుతాధ్యాయంలో దైనందిన క్రియల ద్వారా వరప్రసాదం ఎలా ఆర్థిస్తామో విచారిద్దాం. ఇక్కడ మూడంశాలను ఆలోచిద్దాం.

1. సత్ర్కియలు, బహుమానం

మన జీవితంలో జపించడం, సంస్కారాలు స్వీకరించడం మొదలైన ఆధ్యాత్మిక క్రియలుంటాయి. భుజించడం, నిద్రించడం, ఆయా పనులు చేసికోవడం మొదలైన ప్రాకృతిక క్రియలూ వుంటాయి. వస్తుతః ప్రాకృతిక క్రియలకంటె ఆధ్యాత్మిక క్రియలు ఎక్కువ విలువ కలవి. ఐనా జ్ఞానస్నానం ਕੇਹੇo, దివ్య వ్యక్తులను హృదయంలో నిలుపుకొని, దివ్యజీవితం జీవించే విశ్వాసులందు ఈ ప్రాకృతిక క్రియలుకూడ విలువైనవే. ఈ యధ్యాయంలో "సత్ర్కియులు" అన్నపదం పైరెండు రకాల క్రియలకూ వర్తిస్తుంది. పాప క్రియలు, సదుద్దేశంతో చేయని పనులు మాత్రమే ఈ సత్ర్కియల్లో చేరవు.

ఇక, దైనందిన బాధ్యతలతో క్రీస్తు జీవితాన్ని జీవించడం ద్వారా క్రీస్తు వరప్రసాదాన్ని పొందుతాం. ఏలాగ? జ్ఞానస్నానంద్వారా క్రీస్తుతో ఐక్యమౌతాం. క్రీస్తు మనతో ఐక్యమౌతాడు. కావున మనం ఆయా పనులు చేసేపుడు క్రీస్తు మనతో సహకరిస్తుంటాడు. అనగా క్రీస్తు వరప్రసాదం మనలో పనిచేస్తుంటుంది. అందుకే పౌలు కూడ "దేవుని అనుగ్రహం వలన నేను ప్రేషితధర్మం అవలంబించాను. నేను గాదు, దేవుని వరప్రసాదమే.నాయందు పని చేస్తుంది" అని చెప్పకున్నాడు – 1కొ 15, 10. అనగా పౌలుతోపాటు దేవుని వరప్రసాదమూ పని చేసిందని భావం. ఈ రీతిగా మనం చేసే ప్రతి కార్యలలోను ప్రభు వరప్రసాదం మనతో పనిచేయడం వల్ల మనం చేసే పనులన్నీ సత్కార్యాలుగా మారిపోతున్నాయి. అయస్కాంతం నిప్ప మొదలైన వస్తువులు తమ కంటుకొన్న పదార్థాలకు తమ ధర్మం ఇస్తాయి. ఇదే రీతిని ప్రభువున కంటుకొని ప్రభువునందు నెలకొనిన మన జీవితంగూడ ప్రభు జీవితంలాగే దివ్యమౌతుంది.