పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిరుత్సాహపడి వెనుకకు పోతూంటాడు. ఈ రీతినే చిత్తశక్తి కూడ ఆధ్యాత్మిక జీవితం జీవించడానికి బద్దకించి ఇంద్రియాలకు రుచించే జంతుజీవితం జీవిస్తూంటుంది.

ఈ పరిస్థితుల్లో చికిత్సాత్మక వరప్రసాదం మన మీద ఔషధంలాగ పనిచేస్తుంది. మన బుద్ధిచిత్తశక్తులందలి జాడ్యాన్ని తొలగిస్తుంది. అందుకే దీన్ని చికిత్సాత్మక వరప్రసాదం అన్నాం. అనగా మన ఆత్మ వ్యాధిని నయం చేసే వరప్రసాదం. ఇది బుద్ధిశక్తికి ఓ విధమైన వెలుగునిచ్చి దివ్య సత్యాలను గ్రహించేలా చేస్తుంది. ఈ వెలుగుద్వారా మన బుద్ధి ప్రపంచ వస్తువులను ఆధ్యాత్మిక సత్యాలయందు రంజిల్లుతుంది. అదేవిధంగా చిత్తశక్తికి కూడ ఓ విధమైన దివ్య ప్రేరణాన్ని యిస్తుంది. దీని వలన చిత్తం ఇంద్రియ వ్యాపారాలపై ఏవగింపునొంది ఆధ్యాత్మికకార్యాల్లో రంజిల్లుతుంది. సృష్టి వస్తువులమీది ప్రేమను విడనాడి సృష్టికర్తమీద మనసు నిల్పుతుంది.

ఆధ్యాత్మిక జీవితంలో చికిత్సాత్మక వరప్రసాదం చేసే మేలు అంతింతగాదు. నీతిని పొందిన పిదప గూడ చికిత్సాత్మక వరప్రసాదం ఆదుకోందే పెద్ద కాలం పుణ్యావస్థలో నిలువలేం. మనమా బలహీనప నరులం. పాపావకాశాలా పెక్కులు. కనుక ఈ వరప్రసాదం చేయిచ్చి ముందునకు నడపందే చావైన పాపాలనే గోతుల్లో తప్పక కూలిపోతాం.

ఇక, పాపపు ప్రాణులమైన మనకు స్వల్ప పాపపు అవకాశాలు అనంతాలు, కాని చికిత్సాత్మక వరప్రసాదం మనకు అండగా నిలుస్తుంది. స్వల్పపాపాల నుండి మనలను చాలవరకు వైదొలగిస్తుంది. ఐనా చికిత్సాత్మక వరప్రసాదం సాయపడినంక గూడ, దేవుని ప్రత్యేక అనుగ్రహం లేందే స్వల్పపాపాలన్నిటినీ విడనాడలేం, మరియమాతకు మాత్రం ఈలాంటి ప్రత్యేకానుగ్రహం వుందని బోధిస్తుంది ట్రెంటుసభ.

దివ్యగ్రంథాలు జన్మకర్మ పాపఫలితాలను తేటతెల్లంగా వర్ణిస్తాయి. ప్రపంచమింకా చాలవరకు ఈ లోకపు నాయకుని ఆధీనంలోనే వుంది -యోహా 14, 30. చేప నీటిలోలాగ మనమూ రేయింబవళ్లు పాపపులోకంలో మునిగి తేలుతూంటాం. మన యెడదలో కూడ రోజురోజు పాపపు మొగ్గలు పొటమరిస్తూనే వుంటాయి. ఈ పరిస్థితుల్లో మన బుద్ధికి వెలుగునీ, చిత్తానికి చైతన్యాన్నీ దయచేసే చికిత్సాత్మక వరప్రసాదాన్ని ప్రసాదించమని పావనాత్మను అడుగుకొంటూండాలి.

2. ఉద్ధరణ వరప్రసాదం

ఉద్ధరణ మనగా పైకి లేపడం. మన కార్యాలను ప్రాకృతిక దశ నుండి ఆధ్యాత్మిక దశకు లేపుకొని పోయేది ఉద్ధరణ వరప్రసాదం. నా చేతిలోని కలం పుస్తకం వ్రాస్తుంది. ఐనా పుస్తకం వ్రాయాలంటే బుద్ధి, చిత్తశక్తులుండాలి. కలానికి ఈ శక్తులు లేవు. కనుక అది స్వయంగా పుస్తకం వ్రాయలేదు. బుద్ధి చిత్తశక్తులతో కూడిన నేను చేతిలోనికి తీసుకున్నంక అది పుస్తకం వ్రాస్తుంది. ఇదే రీతిగా మన ఆత్మ కూడ స్వయంగా ఆధ్యాత్మిక 283