పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తే దయచేస్తాడు. భర్త భార్యకు ద్రోహం చేసినా, భార్య భర్తకు ద్రోహం చేసినా వాళ్లు ఒకరినొకరు క్షమించే శక్తినిగూడ ప్రభువే దయచేస్తాడు. ఏ కారణంచేతనైనాసరే దంపతులు విడిపోతుంటే క్రీస్తు సిలువ వారిని ఐక్యపరుస్తుంది. సంసారజీవితంలో పరస్పర విశ్వసనీయత, అపరాధక్షమాపణం ముఖ్యాంశాలుగా ఉండాలి. ఇవి క్రీస్తు అనుగ్రహంవల్ల సాధ్యమౌతాయి. ఉత్దానక్రీస్తు ఆత్మ దంపతులమీదికి దిగివచ్చి వారికి ఐక్యతనూ ప్రేమశక్తినీ ప్రసాదిస్తుంది. దీనివల్లనే చాల కుటుంబాలు విచ్చిన్నంకాకుండా నిలవగల్లుతున్నాయి.

క్రీస్తు తిరుసభలకు ఎడబాటు లేదు కనుక ఆ పోలికను పొందిన స్త్రీ పురుషుల వివాహానికిగూడ విడాకులు లేవు. అత్యవసరమైతే భార్యాభర్తలు విడిపోయి వేరువేరుగా జీవించవచ్చు. కాని భార్యాభర్తలు బ్రతికివుండగా ఒకరు వేరొకరిని వివాహం జేసికోవడం మాత్రం పనికిరాదు. హెన్రీరాజు తన భార్య క్యాతరిన్ కు విడాకులిచ్చి అన్నబోలిన్ అనే ఆవిడను పరిణయమాడగోరాడు. రోము అంగీకరింపలేదు. అతడు తిరుసభను వదలివేసి ఆంగ్లికన్ శాఖను స్థాపించాడు. ఈలాంటి విషమ పరిస్థితుల్లోగూడ తిరుసభ విడాకులను అంగీకరింపలేదు.

భార్యాభర్తల్లో ఒకరు అక్రైస్తవులనుకొందాం. ఆవ్యక్తి క్రైస్తవమతం నచ్చక తన క్రైస్తవ సహచ(రి)రుని విడనాడితే, ఆ విడనాడిన క్రైస్తవ వ్యక్తి మళ్లా వివాహం చేసికోవచ్చు దీనికే "పౌలుగారి అనుమతి" అని పేరు - 1కొ 7,15. క్రైస్తవ వివాహంలో క్రీస్తు తిరుసభల పోలిక ముఖ్యం. ఇక్కడ అక్రైస్తవవ్యక్తి ఈ పోలికను నిరాకరిస్తున్నాడు. కనుక వివాహం రద్దవుతుంది. అందుచే క్రైస్తవ వ్యక్తి మళ్ళా పెండ్లి చేసుకోవచ్చు.

ఈ పట్టున వివాదాస్పదమైన ఓ అంశాన్ని ప్రస్తావించాలి. ఏ కారణం చేతనయినాసరే భర్త భార్యను పరిత్యజించవచ్చా అని పరిసయులు క్రీస్తుని అడిగారు. ప్రభువు పరిత్యజించకూడదు అని చెప్పి ఇంకో విషయాన్నిగూడ తెలియజేసాడు. వ్యభిచారణం కారణం వలన తప్ప తన భార్యను విడనాడి వేరొకతెను పరిణయమాడేవాడు వ్యభిచారదోషి ఔతాడని చెప్పాడు – మత్త 19,9. ఇక్కడ "వ్యభిచార కారణంవల్ల తప్ప" అనే మాటలకు అర్థమేమిటి? భర్తగాని భార్యగాని వ్యభిచారం చేసినపుడు ఆ వివాహం రద్దవుతుందని భావమా? ఇక్కడ వ్యభిచారం అనే మాటకు గ్రీకుమూలంలో వాడిన పదం "పోర్నేయా". దానికి తుల్యమైన హీబ్రూపదం “జేనూత్", అన్న మారుచెల్లెలు మొదలైన దగ్గరి రక్తబంధువులు పెండ్లి చేసుకొంటే దాన్నియూదులు జేనూత్ వివాహం అనేవాళ్ళ ఈలాంటి వివాహాలు చెల్లవు. అవి అసలు పరిణయాలే కాదు. కనుక ఈ జంట విడిపోవలసిందే. పై వచనంలో వ్యభిచారకారణం వలన తప్ప అన్నపుడు క్రీస్తు ఉద్దేశించింది ఈ జేనూత్ పెళ్ళె. ఇది అసలు వివాహమే కాదు. కనుక రద్దుకావలసిందేనని క్రీస్తు