పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. అవిచ్ఛిన్నత

అవిచ్ఛిన్నత అంటే భార్యాభర్తలు విడివడిపోకుండా జీవితాంతం కలసి జీవించడం. అనగా విడాకులు లేకపోవడం.

అన్ని జాతుల ప్రజలు వివాహం స్థిరంగా వుండాలని కోరుకొన్నారు. విడాకులను నిషేధించారు. ఐనా చాలమంది ఈ నిషేధాన్ని ఉల్లంఘించి విడాకులు పొందారు. అలా పొందిన తావులందెల్ల కుటుంబాలు జాతులుకూడ విచ్ఛిన్నమైపోయాయి.

బిడ్డల మేలుకోరే తల్లిదండ్రులు విడివడిపోకూడదు. కనుక విడాకులు పనికిరావు, పైగా భార్యాభర్తల బంధం పరిపూర్ణ ప్రేమను కోరేది. ఒక పురుషుడు ఒక స్త్రీనీ, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి జీవితాంతం పరిపూర్ణంగా ప్రేమించాలి. అలా కాకుండ వాళ్ళ మధ్యలో విడివడిపోయి మరో మూడో వ్యక్తిని ప్రేమిస్తే అది వివాహమెలా ఔతుంది?

దేవుడు ఆదిదంపతులను జతగూర్చినపుడు విడాకులు పొసగవనే భావించాడు. ఆదామేవలు ఏకశరీరం, ఏకవ్యక్తికావాలనే అతని ఉద్దేశం - ఆది 2,24, తర్వాత మోషే ఆనాటి ప్రజల హృదయ కాఠిన్యాన్ని అనుసరించి - అనగా ప్రాచీనకాలంలోని పురుషులు స్త్రీలపట్ల బహూక్రూరంగా ప్రవర్తిస్తారని తెలిసి, స్త్రీల రక్షణను మనసులో పెట్టుకొనే విడాకులను అంగీకరించాడు. మగవాడు అబలను హింసించి చంపివేయడంకంటె విడాకులిచ్చి పంపివేయడం మెరుగుకదా! కాని సృష్ణ్యాదిలో ఈ విడాకుల విధానం లేదు -మత్త 19,8, ఇరువురు వ్యక్తులు ఏకశరీరులై, అనగా ఏకప్రాణం కలవారై, ఏకవ్యక్తిగా ఒనగూడి జీవించాలంటే విడాకులు పొసగవు. దేవుడు జతపరచిన జంటను మానవమాత్రులు వేరుపరచరాదు-మత్త 19,6. ఇది క్రీస్తు బోధ.

16వ శతాబ్దంలో చీలిపోయిన ప్రోటస్టెంటు శాఖలు విడాకులను అంగీకరించాయి. కాని క్యాతలిక్ తిరుసభ మాత్ర0 ట్ట్రెంటు మహాసభ కాలంనుండి వివాహబంధం అవిచ్ఛిన్నంగా ఉండిపోవాలని అధికారపూర్వకంగా బోధిస్తూ వచ్చింది. విశేషంగా భార్యాభర్తలు శారీరకంగా కలసికొన్నపుడు వారి వివాహం ఖండితంగా అవిచ్ఛిన్నంగా వుండిపోతుందని తిరుసభ బోధ. ఎందుకు?

క్రీస్తు తిరుసభల పోలికసోకి క్రైస్తవ వివాహం వరప్రసాదాన్ని పొందుతుంది. ప్రభువు తిరుసభ కొరకు ప్రాణాలర్పించాడు. తిరుసభ ప్రేమభావంతో తన్నుతాను క్రీస్తుకి అర్పించుకొంటుంది. అలాగే వివాహజీవితంలో గూడ భార్యాభర్తలు ఒకరికొకరు ప్రాణాలర్పించుకొంటూ తుదివరకు విడిపోకుండా జీవించాలి. దంపతులు ఒకరినొకరు ప్రేమించుకొంటూ తుదిగడియల వరకు ఒకరితో వొకరు కలసివుండే వరప్రసాదాన్ని