పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. పేత్రు వ్రాసిన మొదటి జాబులో దేవాలయ సజీవ శిలలు అనే వుపమానం వాడాడు -23. క్రీస్తు శిల. ఈ శిలను మూలరాయిగా చేసి తండ్రి దివ్యమందిరాన్ని నిర్మిస్తాడు. క్రైస్తవులుకూడ సజీవ శిలల్లాగ ఆ మందిరంలో నిర్మింపబడతారు. అనగా క్రీస్తుతో కూడి మనమంతా ఒక మందిరమౌతాం. ఈ దేవాలయంలో మనం పరలోకపు తండ్రిని ఆరాధిస్తాం. ఇక్కడ వుపమానం యిది. మందిరానికి ఐక్యతా నిలకడా పెంపూ యిచ్చేది మూలరాయి. అలా క్రైస్తవ ప్రజలకు జీవమూ ఐక్యతా ప్రసాదించేది క్రీస్తు.

పై మూడుపమానాలు క్రీస్తుతో మనకుండే సంబంధాన్నీఐక్యతనూ సూచిస్తాయి. ఈయైక్యత జ్ఞానస్నానం నుండి ప్రారంభమౌతుంది. జ్ఞానస్నానమంటే క్రీస్తు మరడోత్థానాల్లో పాలుపొంది అతని వరప్రసాదాన్ని స్వీకరించడమే.

2. నరుడు దివ్యుడు

పూర్వాధ్యాయంలో పవిత్రీకరణ వరప్రసాదాన్ని గూర్చి చెప్పాం. ఈ పవిత్రీకరణ వరప్రసాదం మనలను దివ్యులను చేస్తుంది. ప్రస్తుతాధ్యాయంలో ఈ దివ్యత్వమంటే యేమిటో విచారించి చూద్దాం. ఇక్కడ మూడంశాలు తెలిసికొందాం.

1. నరుడు దేవుని ప్రతిబింబం

దివ్యజీవితం జీవించే సామర్థ్యాన్ని ఇచ్చేది మనలోని ఆత్మం. ఈ యాత్మ ద్వారానే నరుడు దేవునిపోలికను పొందుతున్నాడు. ఈ పోలికను ఆదికాండం ఈలా వర్ణిస్తుంది. దేవుడు నరుని సృజించాలి అనుకున్నాడు. సమస్త ప్రాణికోటిపై అతడు అధికారం నెరపాలి అనుకున్నాడు. ఇట్లనుకొని తనకు ప్రతిబింబంగా నరుని సృజించాడు. స్త్రీ పురుషులనుగా ఆ నరుని సృజించాడు-126-28. పూర్వ నూత్నవేదాలు చాలా తావుల్లో ఈ విషయాన్ని పేర్కొంటాయి. నరుడు దేవునికి పోలికగా వుంటాడు అనడంలో దివ్యగ్రంథం ఉద్దేశాలు ఇవి 1. నరుడు భగవంతునికి పోలికగా సృజింపబడ్డాడు అంటే అతడు జంతువుల కంటె అధికుడు. ఈ పోలికద్వారా నరుడు భూమ్యాకాశ సముద్రాల్లో సంచరించే ప్రాణులన్నింటి మీద అధికారం నెరవుతూన్నాడు. 2. ఈ పోలిక ద్వారానే అతడు దేవునికి పుత్రుడయ్యాడు. 3. అతని యందు అతనిద్వారా దేవుడు భూమిమీద నెలకొన్నాడు. 4. ఈ పోలికే అతనికి అమృతత్వాన్ని ఇస్తుంది. 5. పాపం వలన నరునిలోని యీ పోలిక మాసిపోతుంది. 6. నరునిలో మళ్ళా యీ పోలికను కలిగించడానికే క్రీస్తు వచ్చాడు. అతడు భగవంతుని ప్రతిబింబం. క్రీస్తు రూపాన్ని ప్రతిబింబించు కోవడమే మన బాధ్యత 8. జ్ఞానస్నానం మొదలైన సంస్కారాలవల్ల, విశ్వాసంవల్లా నైతిక జీవితంవల్ల నానాటికీ ఈ క్రీస్తు పోలిక మనలో పెరుగుతుంది. పరిశుద్ధాత్మఓ చిత్రకారునిలాగ క్రీస్తు రూపాన్ని మన హృదయంమీద చిత్రిస్తుంది.