పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు సిలువమీద మరణంచిందీ మల్లా ఉత్థానమైందీ మన పాపాలను పరిహరించడం కోసమేగదా! కావున నీతిని పొందడం ద్వారా మన పాపాలు యథార్థంగా పరిహారమౌతాయికాని, కప్పివేయబడవు. పూర్వవేదపు యిస్రాయేలు ప్రజలు కూడ దేవుని కృపవల్ల తమ పాపాలు పూర్తిగా మన్నింపబడ్డాయనే నమ్మారు. 51వ కీర్తన "ప్రభూ! కారుణ్యతిశయంతో నా పాపాలను తుడిచివేయి. నన్ను పూర్తిగా కడిగి శుభ్రాత్ముని చేయి.హిస్సోపతో నా పాపాలను కడిగివేయి. నేను మంచుకంటె తెల్లనయ్యేలా నన్ను కడుగు. నాలో నిర్మల హృదయం నెలకొల్పు అంటుంది. ఈ వాక్యాల భావం ప్రకారం, యావే మన పాపాలను పలకమీది అక్షరాలనులాగ తుడిచివేస్తాడు. శుభ్రమైన నీటిలో మరికి బట్టనులాగ మన మలినాత్మను శుభప్రరుస్తాడు. కనుక దేవుడు మన ఆత్మను క్రీస్తు వరప్రసాదంతో కప్పివేయుడు. దాని పాపాలను పూర్తిగా క్షమిస్తాడు.

2. క్రొత్తదనము : పౌలు ఎఫేసీయుల జాబులో "మీ చిత్తవృత్తి యందు నూత్నత్వం పొందండి. నీతి, భక్తి కలవాట్టె దేవునికి పోలికగా సృజింపబడిన నవీన స్వభావాన్ని చేకొనండి" అంటాడు - 424. ఇలా నూత్నత్వం పొందాలి అని బైబులు చాలా తావుల్లో చెప్తుంది.

ప్రార్థనా భావాలు

1. జ్ఞానస్నానంద్వారా మనం క్రీస్తుతో ఐక్యమౌతాం. అతనినుండి వరప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఈ యంశాన్ని నూత్నవేద రచయితలు మూడుపమానాలలో వివరించారు.

పౌలు దేహం అవయవాలు అనే వుపమానం వాడాడు - 1కొ 12, 27. "జ్ఞానస్నానంద్వారా క్రైస్తవులు క్రీస్తుతో ఐక్యమై అతనితో ఒక్కదేహంగా ఏర్పడతారు. ఈ దేహానికి శిరస్సు క్రీస్తు అవయవాలు క్రైస్తవులు. అవయవాలు శిరస్సు వలన జీవిస్తాయి. ఆలాగే క్రైస్తవులు క్రీస్తు వలన జీవిస్తారు. శిరస్సులోని జీవం అవయవాల్లోనికి మల్లే క్రీస్తులోని దివ్యజీవం క్రైస్తవుల్లోనికి ప్రసరిస్తుంది. ఈ దివ్య జీవనమే వరప్రసాద జీవితం,

2. యోహాను తీగలు రెమ్మలు అనే వుపమానం వాడాడు. -15, 16. తీగలోని సారం రెమ్మలలోనికి ప్రసరిస్తుంది. ఆరెమ్మలు ఆకుదొడిగి పూలుపూచి కాయలు కాస్తాయి. తల్లి తీగనుండి వేరుచేస్తే రెమ్మలు వెంటనే వాడిపోతాయి. క్రైస్తవులు కూడ క్రీస్తుతో ఐక్యమై అతని సారంవలన జీవిస్తుంటారు. అతని సారం వలననే సత్ఫలితాన్ని ఇస్తుంటారు. క్రీస్తునుండి వేరైతే నిప్రయోజకులై పోతారు. క్రీస్తునుండి క్రైస్తవులు పొందే సారమే వరప్రసాద జీవితం.