పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాలిన్యం అడ్డుపడనంతవరకూ, వెలిగిపోతూంటుంది. వెలుగు పైబడి నంతనే స్ఫటికం మొదలైన నిర్మల వస్తువులు తాము వెలిగిపోతాయి. నలువైపుల నూత్న తేజం వెదజల్లుతాయి. ఆ రీతిగానే మన యాత్మలు కూడ దేవుని పొంది దేవుని రూపం గైకొంటాయి. దివ్యత్వం పొందుతాయి?

ఈ సాదృశ్యంలోని భావాలివి : (1) పవిత్రీకరణ వరప్రసాదం ఆత్మ ఊపరిభాగంమీద కాదు, ఆత్మయందంతటా ప్రసరిస్తుంది. వెలుగు స్ఫటికాన్నంతటినీ వెలిగించినట్లే వరప్రసాదం ఆత్మనంతటినీ వెలిగిస్తుంది. జ్యోతిర్మయ స్పటికం తానూ జ్యోతీ రెండూకూడ. అలాగే వరప్రసాదమయాత్మం తానూ వరప్రసాదమూ రెండూకూడ. వెలుగు స్ఫటికం యొక్క అస్తిత్వాన్ని నాశం చేయని యట్లే వరప్రసాదంకూడ ఆత్మ ఆస్తిత్వాన్ని నాశం చేయదు. (2) వెలుగు ప్రసరించినంత కాలం మాత్రమే స్ఫటికం ప్రజ్వరిల్లుతుంది. ఆ వెలుగు అంతరించగానే స్ఫటికం బండవారిపోతుంది. అదేరీతిగా మన హృదయంలో దైవసాన్నిధ్యం ఉన్నంతకాలమే వరప్రసాదమూ నిలుస్తుంది. పాపం ద్వారా ఆ దేవుని పోగొట్టుకొనినంతనే ఆ దైవతేజం కూడ చల్లారిపోతుంది.

దివ్యజ్యోతితో వెలిగే ఆత్మం ఆధ్యాత్మిక సత్తు కావున దానిని ఈ భౌతిక నేత్రాలతో చూడలేం. చూచామో, మరి ఈ యైహిక వస్తువులేవీ మన కంటికి ఇంపుగొల్పవు. పెద్దతెరీస, సియన్నా కత్తరీన మొదలైన పనీతురాళ్ళ కూడ పవిత్రస్థితిలోనున్న ఆత్మకంటె సుందరరూపం మరొకటి లేదని వ్రాసారు. ఉదయం గడ్డిమీద కన్పించే నీటిబొట్ల సూర్యుడు ఉదయించనంతవరకూ ఒట్టినీటిబొట్లే. కాని సూర్యకిరణాలు సోకిన వెంటనే ఆ నీటిబొట్ల సూర్యుణ్ణి ప్రతిబింబించుకొని ముత్యాల్లాగ మెరిసిపోతాయి. మన ఆత్మకూడదైవవరప్రసాదాన్ని పొందిన వెంటనే దివ్యరూపంతో, దివ్యతేజంతో మెరసిపోతుంది. ఆ బిందువు తానూ ఓ సూర్యుళ్ళాగ వెలిగినట్లే, మన ఆత్మం కూడ తానూ ఓ దేవుళ్ళాగ మెరసిపోతుంది. ఐనా ఆత్మ దివ్యతేజాన్ని ఆవలితీరాన అడుగుపెట్టిందాకా ఈ భౌతిక చక్షువులతో వీక్షించలేం. ఇంకా తీరము జేరని బాటసారులమైన మనం దివ్యరూపాలను మాసిన అద్దంలోని ప్రతిబింబంలాగ మసకమసకగా మాత్రమే దర్శించగలం - 1 కొరి 13, 12.

5. దివ్యగ్రంథ వర్ణణం

టెంటుసభ ప్రకారం, నీతిని పొందండమంటే మన పాపాలు యథార్థంగా పరిహారం కావడం. మన ఆత్మ వర ప్రసాదాన్ని పొంది క్రొత్తతనాన్నీ మార్పునీ చేకొనడం. దివ్యగ్రంథాలు కూడ ఈ సత్యాలనే బోధిస్తాయి.

1. పాపపరిహారం : మొదటి యోహాను జాబు క్రీస్తు రక్తం మనలను పాపంనుండి శుభ్రంగా కడిగివేస్తుంది అని చెప్తుంది. 1,7. స్నాపక యోహాను క్రీస్తును చూచి "ఇదుగో "లోకం పాపాలను తొలగించడానికై వచ్చిన దేవుని గొర్రెపిల్ల' అంటాడు - యోహా 1,29