పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. పితృపాదుల ఉపమానాలు

పవిత్రీకరణ వరప్రసాదాన్ని గూర్చి చెపూపితృపాదులు రెండుపమానాలు వాడారు. మొదటిది మైనంమీద వేసిన ముద్ర. రెండవది స్ఫటికం గుండా ప్రసరించే వెలుగు.

1. అలెగ్జాండ్రియ సిరిల్ మన ఆత్మలో పనిచేసే పరిశుద్ధాత్మను వర్ణిస్తూ ఈలా చెప్పాడు : “దేవుని నుండి వెడలివచ్చే దైవవ్యక్తి పరిశుద్దాత్మ మైనంపై ముద్రలాగ తన రూపాన్ని మన హృదయంమీద ముద్రిస్తుంది. చిత్రకారుడు ఫలకంపై మరియొకరి చిత్రాన్ని గీస్తాడు. కాని ఈ దివ్యవ్యక్తి మాత్రం తన రూపాన్నే మన హృదయాలమీద చిత్రిస్తాడు. ఈ దివ్యరూపం వలన మనం పాపంద్వారా కోల్పోయిన దేవుని పోలికను తిరిగి పొందుతాం.

ఈ సాదృశ్యంలోని భావాలివి : (1) మన హృదయంలో పరిశుద్దాత్మ వశించడమూ, ఆ యాత్మయిచ్చే వరప్రసాదమూ మైనంమీద వేసిన ముద్రతో పోల్చబడ్డాయి. మైనపు ముద్ద ముద్రను గైకొని నూత్నరూపం తాలుస్తుంది. అలాగే మనంకూడ వరప్రసాదం ద్వారా క్రొత్తతనం పొందుతాం.మార్పుచెందుతాం. (2) లోహంతో చేయబడిన ముద్ర తన రూపాన్ని మైనంమీద ఒత్తుతుంది. మైనంమీద పడిన ముద్ర ఆ లోహపుముద్ర రూపమే. ఇదేరీతిగా భగవంతుడు కూడా పవిత్రీకరణ వరప్రసాదంద్వారా తన పోలికను మన ఆత్మమీద చిత్రిస్తాడు. ఈ పోలిక వలననే మనం దివ్యత్వం పొందుతున్నాం.

ఇవి పోలికలు. కాని అన్ని వుపమానాల్లోలాగే ఈ యుపమానంలో కూడ కొన్ని లోపాలున్నాయి. మొదటిది ముద్ర మైనం ఉపరిభాగాన్నిమాత్రమే సోకుతుంది. భగవత్కృప ఈలా కాకుండ మన ఆత్మమునంతటినీ సోకి మనకు దైవత్వం ఇస్తుంది. రెండవది, లోహపు ముద్రను తొలగించినంక గూడ మైనంమీద ముద్ర నిలిచే వుంటుంది. కాని ఇదేరీతిగా భగవంతుడు మన ఆత్మపై తన పోలికను కలిగించిన పిదప తాను వైదొలగి పోడు. వడ్రంగి బల్లనుచేసి ముగించాక అతని ఆపేక్ష లేకుండానే బల్ల తనంతట తాను ఉండగలదు. కాని వరప్రసాద విషయం ఈలాగాదు. భగవంతుడు మన హృదయంలో ఉన్నంతసేపే అతని పవిత్రీకరణ వరప్రసాదంకూడ హృదయంలో నిలుస్తుంది. మనం పాపం చేసి అతడు వైదొలగిన క్షణంలోనే పవిత్రీకరణ వరప్రసాదం కూడ అంతరించిపోతుంది. అందుకే భగవంతుని అంతర్నివ్రాసానికీ పవిత్రీకరణ వరప్రసాదానికీ అవినాభావ సంబంధం ఉంటుందని చెప్పాం.

2. పరిశుద్ధాత్మ మనకు దైవత్వాన్ని ఇస్తుందని చెపూ బాసిల్ ఈలా వ్రాసాడు. "పరిశుద్ధాత్మ తన్నాహ్వానించే వాళ్ళ హృదయాల్లో స్థిరమూనూ పరిపూర్ణమునైన వరప్రసాదాన్ని చిలకరిస్తుంది. ఆదివ్యాత్మ కృప అనంతమైనా మన పాత్రతను బట్టి ఆ యాత్మ కృపను స్వీకరిస్తుంటాం. ఆ యాత్మ కూడ తన్నాహ్వానించే వాని హృదయంలో, ఆ హృదయ