పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రెంటుసభ ఈ వాదాన్ని నిరాకరించి ఈలా బోధించింది. నీతిని పొందడమంటే మన పాపాలు యథార్థంగా పరిహరింపబడ్డం. మన ఆత్మలో గూడ క్రొత్తతనం ఏర్పడుతుంది. పవిత్రీకరణ వరప్రసాదం ద్వారా మన ఆత్మనూత్నత్వాన్ని పొందుతుంది. పాపపరిహారంతో పాటు ఈ పవిత్రీకరణ వరప్రసాదాన్ని గూడ భగవంతుడే మనకు అనుగ్రహిస్తాడు. దానిద్వారా మనం పాపావస్థనుండి పవిత్రావస్థను పొందుతాం. నీతిని పొందడమంటే నీతిమంతుడైన దేవుడు మనలను చల్లని చూపన చూడ్డంగాదు. పాపపరిహారం వలనా పవిత్రీకరణ వరప్రసాదం వలనా మనలను నీతిమంతులను చేయడం, ఆశాపాశాలు పాపం వలన పడుతున్నాయి, పాపానికి పరికొల్పుతున్నాయి. కాని అవి స్వయంగా పాపాలు కావు, కావున మనం నీతిని పొందినంక గూడ ఆశాపాశాలు అనే పాపాలు ఉంటాయి అనే మాట పొసగదు.

3. లూతరు మతమున నీతిని పొందాలంటే మన తరపున కావలసింది ప్రేమతో గూడిన నమ్మిక మాత్రమే. దాని వలననే భగవంతుడు మనలను రక్షిస్తాడు. దీనికి మినహా మన సహకారం ఎందుకూ పనికిరాదు. జన్మపాపంద్వారా నరుల బుద్ధి చిత్తశక్తులు పూర్తిగా చెడిపోయాయిగనుక మన స్వాతంత్ర్యంగూడ నశించింది. కావున రక్షణకార్యంలో మన తోడ్పాటేమీ లేదు. మనం వరప్రసాదాలను ఆర్థిస్తాం అనడం కల్ల. మనం వరప్రసాదం ఆర్థిస్తే క్రీస్తు వరప్రసాదం వ్యర్థమైపోదా?

టెంటుసభ ఈ వాదాన్ని ఖండించి ఈలా బోధించింది భగవంతునియందు ప్రేమతో గూడిన నమ్మికను ఉంచడం అవసరమేగాని అంతమాత్రంచేతనే నీతిని పొందలేం. తొలిపాపంద్వారా మన బుద్ధి చిత్తశక్తులు గాయపడ్డాయి గాని నశింపలేదు. కావున నరులకు అవసరమైన స్వాతంత్ర్యం వుంది. ఈ స్వాతంత్ర్యం వలన, మనతోడ్పాటులేందే దేవుడు మనలను రక్షింపడు. మనం పుణ్యాన్ని ఆర్థించందే మోక్షంలో అడుగుపెట్టలేం. మనంకూడ పుణ్యాన్ని అర్ధిస్తున్నామంటే క్రీస్తు సహాయంతోగాని, క్రీస్తు నిస్సహాయంగాగాదు. మనం ఆర్థించే వరప్రసాదం క్రీస్తు వరప్రసాదంమీద ఆధారపడి వుంటుంది కనుక ఆ ప్రభు వరప్రసాదాన్ని వ్యర్థం చేయదు.

నేడు ప్రోటస్టెంటు శాఖలను క్యాతలికు శాఖ నుండి వేరుపరచే ప్రధానాంశాల్లో ఇవీ కొన్ని గనుక పాఠకులు ఈ విభేదాలను చక్కగా గుర్తించాలి. లూతరు బోధించిన పై మూడు సిద్ధాంతాలను 53 ప్రోటస్టెంటు సంపూర్ణంగా అంగీకరింపవు. పైగా అసలు లూతరు బోధించిందేమిటి అన్న విషయంలోగూడ ప్రోటస్టెంటు శాఖల్లో భేదాభిప్రాయాలున్నాయి.