పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువుకి కబురు పెట్టాడు. ప్రభువు అతని యింటికి వస్తూండగా సైన్యాధిపతి అతని యొద్దకు దూతలనపంపి "తమరు మా యింటికి రానక్కరలేదు. అందుకు నేను యోగ్యణ్ణి గూడకాదు. మీరకుడనే ఉండి ఒక్కమాట సెలవిస్తేచాలు నా దాసుడు బ్రతికిపోతాడు. మీ యధికారవాక్యం ఏలా పనిచేస్తుందో నాకు బాగా తెలుసు” అని చెప్పించాడు. అతని విశ్వాసానికి ప్రభువు ఆశ్చర్యపోయి "నేను యిప్రాయేలీయుల్లోగూడ ఇంతటి విశ్వాసం చూడలేదు" అని అన్నాడు — లూకా 7,9.

13. ఓమారు ప్రభువు యాయిూరు అనే అధికారి యింటికి వెళూన్నాడు. జనసమూహం ఆయననుసరించి వెళూంది. అప్పడు పండైండేండ్ల నుండి రక్తస్రావవ్యాధితో బాధపడుతున్నఓ దీనురాలు ఆ మహానుభావుని అంగీ ముట్టుకొంటేచాలు నాకు ఆరోగ్యం చేకూరుతుంది అనుకొంది. ఆమె జనసమూహంగుండా చోటుచేసికొనివచ్చి నమ్మికతో ఆయన అంగీ అంచును అంటుకొంది. ప్రభువు ఆమె హృదయాన్నిగుర్తించి కూమారీ! నీ విశ్వాసమే నీకు ఆరోగ్యం చేకూర్చి పెడుతుందిపో" అన్నాడు. వెంటనే ఆమె వ్యాధి నయమయింది - మత్త 9,20-22.

14. ఉత్థానక్రీస్తు శిష్యులకు కన్పించినపుడు తోమా వాళ్లతోలేడు. తర్వాత శిష్యులు ప్రభువు తమకు కన్పించాడని చెప్పినా తోమా నమ్మలేదు. ఆయన ప్రక్క గాయాలలో వేలుపెట్టి చూస్తేనేగాని నేను నమ్మనుపొండి అన్నాడు. తర్వాత ప్రభువు మళ్ళా శిష్యులకు కన్పించాడు. అప్పడు తోమాకూడ వున్నాడు. ప్రభువు అతన్ని పిల్చి "ఓయి! నీవు కోరినట్లే నా గాయాల్లో వేళ్లపెట్టి చూడు. నీవు అవిశ్వాసివిగాక విశ్వాసివిగావుండు. నీ విప్పడు కండ్గార చూచావుగనుక నన్ను విశ్వసిస్తున్నావు. కాని కంటితో చూడకుండానే నన్ను విశ్వసించేవాళ్లు నీ కంటే ధన్యులు సుమా!" అన్నాడు - యోహా 20, 27-29.

15. నీతిమంతుడు విశ్వాసంతో జీవిస్తాడు - హబకూకు 2-4

30. దైవవాక్కు

ప్రభువువాక్కు ప్రభువులాగే అద్భుతమైన క్రియాశక్తిగలది. అది మన హృదయాలమీద పనిచేసి మనకు చైతన్యం కలిగిస్తుంది. కనుక భక్తుడు బైబులువాక్కుతో పరిచయం కలిగించుకోవాలి. ఆ వాక్కును ధ్యానించుకోవాలి.

(1) పఠనాభ్యాసం

1. తిమోతి చిన్ననాటినుండేపూర్వవేదగ్రంథాలు చదువుకొనే అలవాటు కలవాడు. అవి అతనికి క్రీస్తు జ్ఞానాన్నిగలిగించాయి. అతడు ఆజ్ఞానంద్వారా విశ్వాసమూ దానిద్వారా రక్షణమూ పొందాడు - 2 తిమో 3, 15.