పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. ఓ రాత్రి శిష్యులు గలిలయ సరస్సులో పడవమీద ప్రయాణం చేస్తున్నారు. వేకువజామున ప్రభువుగూడ నీళ్లమీద నడుస్తూ వాళ్ళదగ్గరికి వచ్చాడు. ప్రభువునిజూచి పిశాచ మనుకొని భయపడి వాళ్ళంతా కెవ్వన కేకవేసారు. ప్రభువు తన్నెరుకపరచుకొని వాళ్లకు ధైర్యంచెప్పాడు. అపుడు పేత్రు తనూ నీటిమీద నడచి ప్రభువు దగ్గరికి వెళ్లాలనుకొన్నాడు. అతడు నీటిమీద కొన్ని అడుగులు బాగానేవేసాడు. కాని అంతలోనే అతనికి అనుమానం పట్టుకవచ్చింది. అతని విశ్వాసం గూడ సన్నగిల్లిపోయింది. వెంటనే అతడు నీటిలో మునిగిపోవడం మొదలెట్టాడు. ప్రభో నన్ను రక్షించు అని అరచాడు. ప్రభువు చేయిచాచి అతన్ని పట్టుకొని "పేత్రూ! నీవు అల్పవిశ్వాసివి. నీవు సందేహించకుండా ఉన్నట్లయితే నా వద్దకు నడిచివచ్చేవాడివే గదా!" అన్నాడు - మత్త 14, 30-31. 9. ఇంకోమారు పేత్రు రాత్రంతా చేపలు పట్టాలని ప్రయత్నం చేసాడుగాని, అతనికి ఓ పక్కెపిల్లగూడ దొరకలేదు. తర్వాత ప్రభువు అతన్ని పిలిచి లోతులోకి వల విసరమన్నాడు. పేత్రు ప్రభువుమాటనమ్మి లోతులోకి వలవిసిరాడు. వెంటనే వల పిగిలిపోయేటంతగా చేపలు పడ్డాయి. అదిచూచి పేత్రు ఆశ్చర్యపోయి "ప్రభో! నేను పాపిని. నన్ను విడిచి వెళ్లిపో" అని అరిచాడు. — లూకా 5, 4-6. 10. ఓ తడవ ఓ తండ్రి మూగదయ్యం పట్టిన కుమారుడ్డి క్రీస్తువద్దకు తీసికొనివచ్చి నీకు సాధ్యమైతే ఈ దయ్యాన్ని పారద్రోలి నాకు ఉపకారం చేసిపెట్టమని అడిగాడు. క్రీస్తు ఈ పని నాకు సాధ్యమౌతుంది. అనేనమ్మకం నీకువుందా అని ప్రశ్నించాడు. ఆ తండ్రి "ప్రభో! మీకు సాధ్యమౌతుందనే నా నమ్మకం. అయినా నాకేమైనా అపనమ్మకం కలిగినట్లయితే తమరే తోడ్పడాలి" అని వినయంగా అడుగుకొన్నాడు. ప్రభువు ఆ తండ్రి కోరినట్లే అతని కుమారునినుండి దయ్యాన్ని పారద్రోలాడు - మార్కు 9, 22-24. 11. సొలోమోను వైభవంగా జీవించాడు. సుందరమైన వస్తాలను ధరించాడు. కాని ప్రభువు పొలంలో ఎదిగే లిల్లీ మొక్కలకుగూడా చక్కనిపూలు తొడుగుతున్నాడు. అవి కష్టపడి పనిచేయవు, నూలు వడకవు. అయినా వాటి పూబట్టలు సాలోమోను తాల్చిన దుస్తులకంటే యింకా అందంగా ఉంటాయి. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిమంటలో కాలిపోయే గడ్డిపోచలనే భగవంతుడు యింత సుందరంగా అలంకరిస్తూంటే, వాటికంటె ఎంతో యోగ్యడైన నరుడ్డిగూర్చి అతడు ఆలోచించడా? ఆలాంటి భగవంతునిమీద మనకు నమ్మకం ఉండవద్దా? - లూకా 12, 27-28. 12. కఫర్నాము పట్టణంలో ఓ రోమను సైన్యాధిపతి ఉండేవాడు. అతనికి యూదులంటే యిష్టం. వాళ్లకు ప్రార్థనా మందిరంగూడ కట్టిపెట్టారు. ఓమారు అతనికి ఇష్ణుడైన సేవకునికి జబ్బుచేసింది. ఆ సేవకుని వ్యాధి నయంచేయవలసిందిగా అతడు