పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. అబ్రాహాము తొంబై తొమ్మిది యేండ్లవాడైయుండగా భగవంతుడు ప్రత్యక్షమై "నీవు నా సన్నిధిలో నడుస్తూ ఉత్తముడిగా మెలగాలి” అని చెప్పాడు. అబ్రాహాము చిత్తశుద్ధిగల భక్తుడు. అతడు భగవంతుని సన్నిధిలో నడిచాడు. చివరకు ప్రభువు అబ్రాహాముని పరీక్షించడానికై అతని కుమారుడ్డి బలియిూయమని అడిగాడు. అబ్రాహాముకి ఏకైక కుమారుడు ఈసాకు. ఆ ముసలి ప్రాయంలో అతన్ని కోల్పోతే మరో కొడుకు పుడతాడనే నమ్మకంగూడ లేదు. అయినా అబ్రాహాము వెనుకాడలేదు. ప్రభువు ఏదో విధంగా ఈసాకుని మళ్ళా బ్రతికిస్తాడనే నమ్మకంతో అబ్రాహాము అతన్ని బలియిూయడానికి సంసిద్దుడయ్యాడు. ప్రభువు "నీ ఏకైక కుమారుడ్డి నాకు సమర్పించడానికి వెనుకాడలేదు కనుగ నీవు దైవభీతిగలవాడవని రుజువయింది" అని అతని విశ్వాసాన్ని మెచ్చుకొన్నాడు. - ෂධි 17, 1; 22, 10-12.

2. మోషేగూడ మహాభక్తుడు. అతడు ప్రభువుతో ఓ స్నేహితుళ్లాగే ముఖాముఖి మాటలాడేవాడు. యావే తన భక్తులతో కలలద్వారా దర్శనాలద్వారా పరోక్షంగా మాటలాడేవాడు. కాని మోషేతో మాత్రం నేరుగా మాటలాడేవాడు - నిర్గ 33,11. మోషే పది ఆజ్ఞలు తీసికొని కొండదిగి వచ్చేప్పటికల్లా యిస్రాయేలు ప్రజలు విశ్వాసఘాతుకులై ఎద్దును ఆరాధించుకొంటున్నారు. ప్రభువు వాళ్లని వేరంట నాశం జేస్తానన్నాడు. ఆ తలబిరుసుజాతికి మారుగా మోషే సంతానం నుండి యింకో క్రొత్త జాతిని పుట్టిస్తానన్నాడు. అప్పడు మోషే జాతిపితగావచ్చు. అయినా ఆ భక్తునికి అలాంటి బిరుదాలేమీ అక్కరలేదు. అతడు ఆ ప్రజల తరపున దేవుణ్ణి మనవిచేసాడు. ప్రభువు వాళ్లను క్షమించడాని కిష్టపడకపోయినట్లయితే జీవగ్రంథంనుండి తన పేరు తొలగించమని మనవి చేసాడు. అతని చిత్తశుద్ధిని మెచ్చుకొని ప్రభువు యిప్రాయేలీయులను క్షమించి వదలివేసాడు. - నిర్గ 32. 10; 32, 32.

3. అన్నా పెనిన్నా సవతులు. ఎల్మానా భార్యలు. పెనిన్నాకు సంతానం కలిగిందిగాని అన్నాగొడ్రాలుగా ఉండిపోయింది. అందువలన సవతి ఆమెను ఎగతాళిజేసి యేడిపించేది. అన్నాషిలో నగరంలోవున్న ప్రభుమందిరానికి యాత్ర వెళ్ళి దేవునిమందు తన గోడు విన్పించుకొంది. "సైన్యములకు అధిపతివైన ప్రభూ! నాకొక మగబిడ్డను ప్రసాదించావంటే వాడ్డి నీకే సమర్పించుకొంటాను" అని ప్రార్ధించింది. ఆ భక్తురాలి మనవి నాలించి ప్రభువు ఆమెకు ఓ మగకందును ప్రసాదించాడు. ఆతడే సమూవేలు ప్రవక్త -1సమూ 1,11.

4. యిప్రాయేలీయుల అడపడుచు నవోమి మోవాబు దేశంలో వసిస్తూండేది. ఆమెకు ఓర్చ, రూతు అని ఇద్దరు కోడళ్ళ వాళ్ళిద్దరూ మోవాబుదేశస్త్రీలు. నవోమి తన