పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16. శోధనలు

నరులందరికీ శోధనలు వసూంటాయి. కాని శోధనలతో పాటు దేవుడు వాటిని జయించే శక్తినిగూడ ప్రసాదిస్తూంటాడు. కొందరు ఈ శక్తిని వాడుకొని శోధనలను జయిస్తూంటారు. ఆలా చేయనివాళ్లు వాటికి లొంగిపోతూంటారు.

1. పిశాచం ఆదామేవలను శోధించింది. వాళ్ళ ఆ శోధనలకు లొంగిపోయారు. బత్తెబా సౌందర్యం దావీదు శోధనకు కారణమైంది. అతడు లొంగిపోయాడు. సూసన్న సౌందర్యం ఇద్దరు వృద్దులకు శోధనకారణమైంది. వాళ్ళూ లొంగిపోయారు. పోతీఫరుభార్య యోసేపను శోధించింది. కాని అతడు లొంగిపోలేదు. ఈ యంశాలన్నీపూర్వమే చూచాం. అహాబు దుష్టరాజు. అతని భార్య యెసబెలు పరమ దుర్మారురాలు. હ9o ప్రబోధానికి లొంగిపోవడంవల్ల అహాబు చేయని దుష్కార్యమంటూ లేదు. భార్య అతనికి శోధన కారణమైంది - 1 రాజు 21, 25-26.

2. ఓదినం దేవుడు పిశాచంతో "నా భక్తుడు యోబుని చూచావా? అతడు చాల చిత్తశుద్ధికలవాడు" అన్నాడు. కాని దయ్యం యోబుకు కష్టాలువస్తే అతడు నిన్ను దూషించి తీరుతాడు అని దేవునిమందు సవాలు చేసింది. దేవుడు దయ్యంతో "యోబుని నీ యిష్టంవచ్చినట్లు శోధించుకో. అతని ప్రాణాలుమాత్రం తీయకు" అన్నాడు. కనుక పిశాచం యోబుని పరీక్షించడం మొదలెట్టింది. అతనికి మహా వ్యాధులు కలిగించింది. ఆస్తి నష్టం కలిగించింది. ఐనా యోబు "దేవుడు సిరిసంపదలిచ్చి నపుడు హాయిగా అనుభవించాను. ఇపుడు అతడు వాటిని తీసికొని వెళ్లాడు. కనుక ఆ ప్రభుని భూషిస్తానుగాని దూషించను" అన్నాడు. ఈ రీతిగా యోబు పిశాచ శోధనలను ఎదిరించి నిల్చాడు - యోబు 2, 2-6.

3. ప్రభువు అబ్రాహాముని పరీక్షించడానికై అతని కుమారుడ్డి బలి ఈయమని అడిగాడు. ఆ ముసలి ప్రాయంలో ఈసాకుని కోల్పోతే అబ్రాహాముకి మరోకొడుకు పుట్టాడు. ఐనా అతడు దేవుణ్ణి నమ్మి తన కుమారుడ్డి బలి ఈయడానికి సంసిద్దుడయ్యాడు. దేవుడు ఏదోవిధంగా తన కుమారుణ్ణి బ్రతికించక పోతాడా అని అతని నమ్మకం. అతడు నమ్మినట్లే ప్రభువు ఓ పొట్టేలును బలిగా స్వీకరించి ఈసాకును వదిలివేసాడు - ఆది 22.

4. పిశాచం క్రీస్తుని తండ్రి చిత్తాన్ని మీరమని యెడారిలో ముమ్మారు శోధించింది. ఐనా అతడు పిశాచం శోధనకు లొంగలేదు. అతడు ఏవిధంగానైన సిలువ మరణాన్ని నిరాకరించేలా చేయాలని పిశాచం కోరిక, కాని దయ్యం ప్రభుని ఇక మీదట నేరుగా శోధింపక పేత్రుద్వారా శోధింపబూనుకొంది. ఈ పేత్రు పిశాచ ప్రేరితుడై "ప్రభూ! ఈ