పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేను అక్కడికెళ్ళి స్నానం చేసికొంటానులే అని తిరిగి వెళ్ళిపోవడానికి సంసిద్దుడయ్యాడు. కాని సేవకులు అతన్ని సముదాయించి యోర్దును నదికి తీసికొని వెళ్ళారు. ఆ నదిలో మునగగానే అతనికి కుష్ట పోయింది. నామాను తన తప్పను గ్రహించి యెలీషాకు కానుకలు అర్పించబోయాడుగాని ప్రవక్త అవేమీ స్వీకరించలేదు - 2 రాజు 5, 9–14.

6. హేరోదు జ్ఞానులతో "మీరువెళ్ళి యూదులకు రాజుగా బుట్టిన క్రీస్తుశిశువును ఆరాధించండి. మళ్ళా తిరిగి వచ్చి నాకు ఆ బిడ్డ వర్తమానము తెలియజేసారంటే నేను గూడ వెళ్లి అతన్ని ఆరాధించి వస్తాను" అన్నాడు. కాని వాళ్లవర్తమానం విని శిశువును చంపివేయాలనే హేరోదు కోరిక. అయినా జ్ఞానులు తిరిగి అతని వద్దకు రానేలేదు. హేరోదుకు శివమెత్తింది. అతడు బేత్లేహేముకు చుట్టుపట్ల ఉన్న మగబిడ్డలందరునీ చంపించాడు. క్రీస్తు శిశువుగూడ వాళ్లలో నాశమై ఉండాలి అనుకొని సంతృప్తి చెందాడు — మత్త 2, 1-8.

7. క్రీస్తు అద్భుతాలు చేస్తుండగా యూదనాయకులకు కన్ను కుట్టింది. ప్రభువు విశ్రాంతి దినాన అద్భుతాలు చేయకూడదని వాళ్లు కట్టడచేసారు. కాని ప్రభువు విశ్రాంతి దినాన గూడ ఓ అవిటిచేతివాని చేయి నయంచేసాడు. ఆ యద్భుత క్రియనుచూచి యూదనాయకులు పండ్లు పటపట కొరికారు. వెర్రికోపంతో క్రీస్తుని ఏమిచేయాలా అని కుట్రలు పన్నడం ప్రారంభించారు — లూకా 6, 6-10.

8. 1) త్వరగా కోపపడేవాడు తొందరపడిపోతాడు.
కాని వివేకవంతుడు ఓర్పుతో మెలుగుతాడు - సామె 14,17.

2) వీరునికంటె శాంతచిత్తుడు మేలు నగరాన్ని జయించినవానికంటె తన్నుతాను జయించుకొన్నవాడు అధికుడు - సామె 16,32.

10. అశ్రద్ధ

జీవితంలో ఒకోమారు సోమరితనానికి గురౌతాం. చేయవలసిన పని సరిగా చేయం. మన బాధ్యతలను మనం తృప్తికరంగా నిర్వహించం. ఈలాంటి అశ్రద్ధవలన ప్రభుశిక్షకు గురౌతాం. 1. యోసేపుతోపాటు ఫరోరాజు పానీయవాహకుడూ వంటవాడూ కూడ చెరలో ఉన్నారు. వాళ్ళిద్దరికీ రెండు కలలొచ్చాయి. పానీయవాహకునికి తాను మూడు ద్రాక్షపండ్ల గుత్తులు చిదిమి రసంతీసి చక్రవర్తికి అందించినట్లుగా కల వచ్చింది. యోసేపు అతనితో "ప్రభువు మూడురోజుల్లో నిన్నుచెరనుండి విడిపించి మల్లానీ పదవిలో నిన్ను నిల్పుతాడు. 206