పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శోకదినాలు గడచిన పిమ్మట యాకోబు తిత్తి తీయాలనుకొన్నాడు. కాని జిత్తులమారియైన యాకోబు ఈ సంగతి పసిగట్టి ముందుగనే మేనమామ లాబాను నొద్దకు పారిపోయాడు - అది 27, 41.

3. నీనివే యూదులుగాని అన్యజాతివాళ్ళు వసించే పట్టణం. ఆ పట్టణ పౌరులు దుర్మారులైపోయారు. ఐనా ప్రభువువాళు నాశమైపోవాలని గాదు, పశ్చాత్తాపపడి మనసుమార్చుకోవాలని కోరుకొన్నాడు. కనుక యోనా అనే ప్రవక్తను పిలిచి నీవు వెళ్ళి నీనివేపట్టణవాసులకు బోథించు వాళ్ళకు పశ్చాత్తాపం కలుగుతుంది అన్నాడు. కాని అన్యజాతిజనులు ఆలా పశ్చాత్తాపపడి బ్రతికిపోవడం యోనాకిష్టంలేదు. అతడు దేవునిమీద కోపపడ్డాడు. నీనివే పట్టణానికి వెళ్ళడానికి మారుగా ఓడనెక్కి మరో దిశనున్న తర్పీసు పట్టణానికి వెళూన్నాడు. కాని దారిలో ఓడసరంగులు యోనాను సముద్రంలో పడద్రోసారు. ఓ పెద్దచేప అతన్నిబ్రిమింగి ఒడ్డున వెళ్ళగ్రక్కింది. ప్రభువు మళ్ళాయోనాను నీనివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఈమారు అతడు వెళ్ళాడు - యోనా 1-2

4. యోనా ప్రవక్త మీరు పరివర్తనం చెందండని బోధించగానే నీనివే పట్టణ పౌరులు పశ్చాత్తాపపడ్డారు. దేవుడు వాళ్ళను నాశం చేయకుండ క్షమించి వదలివేసాడు. ఈలా అన్యాజాతివాళ్ళను క్షమించి వదలివేసినందులకైయోనా మళ్లాదేవునిమీద అలిగాడు. అతడు నీనివే పట్టణానికి వెలుపల ఓ పందిరి వేసికొని దానిక్రింద కూర్చున్నాడు. ఒకవేళ పట్టణం నాశమై పోతుందేమోనని అటువైపు పారజూస్తూన్నాడు. ఇంతలో ఒక తీగ ఆ పందిరిమీదికి ఎగబ్రాకి యోనాకు నీడ నిచ్చింది, ఆ తీగను చూచి అతడు చాల సంతోషించాడు. కాని మరునాడు దేవుడు ఆ తీగ యెండిపోయేలా చేసాడు. నీడ లేకపోయేప్పటికల్లా యోనా యెండదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ తీగ యెండిపోయినందుకు ఎంతో చింతించాడు. అప్పడు ప్రభువు యోనాకు గుణపాఠం నేర్పాడు. "నీవు ఒక్కతీగ చచ్చినందుకే ఇంతగా దుఃఖిస్తున్నావే! మరి నీనివే పట్టణంలో ఇందరు జనులూ ఇన్నిగొడల్లా నాశమైపోతే నాకు బాధ కలగదా? అన్నాడు. దేవుడు అందరిపట్ల దయ జూపేవాడని యోనా అప్పడు గ్రహించాడు - యోనా 4.

5. నామాను సిరియాదేశపు సైన్యాధిపతి. అతడు కుష్టరోగియై చికిత్సకోసం యిస్రాయేలు దేశంలో వున్న యెలీషా ప్రవక్తవద్దకు వచ్చాడు. నామాను, యెలీషా తన లావజూచి ఎదురువచ్చి తనను కలిసికొంటాడనుకొన్నాడు. కుష్ఠతో నిండిన తన దేహంమీద చేయిచాచి వ్యాధి నయంచేస్తాడనుకొన్నాడు. కాని యెలీషా తన మొగమైనా చూపించకుండానే అతన్ని యోర్గాను నదికివెళ్ళి ఏడుసార్లు స్నానం చేయమని కబురు పంపాడు. నామాను ఉగ్రుడైపోయాడు. ఈలాంటి నదులు మా దేశంలో చాలావున్నాయి.