పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ పొలం నా కమ్మమని కోరాడు. నాబోతు అది పిత్రార్జితం, నేనా పొలాన్ని అమ్మనని మొండిపట్టు పట్టాడు. అంతట అహాబు ప్రోద్బలంపై ఇద్దరు దుర్మార్గులు నాబోతు మీద నేరం తెచ్చారు. అతడు దేవుడ్డీ రాజనీ దూషిస్తున్నాడని కూటసాక్ష్యం పలికారు. అహాబు నాబోతును రాళ్ళతో కొట్టి చంపించి అతని పొలాన్ని స్వాధీనం చేసికొన్నాడు. అప్పడు యేలీయా ప్రవక్త అహాబును కఠినంగా శపించాడు. నాబోతు పొలంలోనే నీ నెత్తురు కుక్కలు నాకుతాయిపో అన్నాడు. ప్రవక్త అన్నంతపనీ జరిగింది-1 రాజు 21, 1-16,

5. యూదాలో దయ్యం ప్రవేశించింది. అతడు ఆసబోతుతనంతో గురువుని ముప్పది వెండికాసులకు అమ్మకొన్నాడు-లూకా 22, 3-6.

6. యెరూషలేములోని తొలినాటి క్రైస్తవులు ఉమ్మడి జీవితం జీవిస్తూండేవాళ్ళ ఈ సమాజానికి పేత్రు పెద్ద, అననీయ సఫీరా అనే భార్యాభర్తలు వాళ్ళంతట వాళ్లేవచ్చి ఈ సమాజంలో చేరారు. కాని వాళ్ళ పొలం ఆమ్మకోగా వచ్చిన డబ్బులో కొంతసొమ్ము మిగుల్చుకొని మిగతాసొమ్మ మాత్రమే పేత్రుకు ముట్టజెప్పారు. పేత్రు అననీయాను పిల్చి నీకు వచ్చిన డబ్బు ఇంతేనా అని అడుగగా, అతడు ఇంతేనని బొంకాడు. వెంటనే అతడు ప్రాణాలు విడిచి నేలమీద పడ్డాడు. అతని శవాన్ని పాతిపెట్టారు. కొంత సేపయ్యాక సఫీరా భర్త చనిపోయాడన్న సంగతి తెలియక ఎక్కడికోవెళ్ళి తిరిగివచ్చింది. పేత్రు సఫీరా డబ్బువిషయమై ప్రశ్నించగా ఆమెకూడ బొంకింది. సఫీరాకూడ ప్రాణాలు విడిచి నేలమీద పడగా ఆమెనుగూడ పాతిపెట్టారు - ఆచ 5, 1-11

7. పౌలు ఎఫెసు పట్టణంలో బోధిసూ విగ్రహారాధనను ఖండించాడు. ఆ పట్టణంలో దెమిత్రి అనేకమసాలివాడు ఆర్తెమి దేవతకు వెండిగుళ్ళను చేయించి అమ్మేవాడు. ఈ గుళ్ళవలన అతనికి అతని పనివాళ్ళకీ మంచి ఆదాయం వస్తూండేది. కాని పౌలు బోధలవల్ల చాలమంది ఈ గుళ్ళను కొనడం మానేసారు. దెమిత్రి వ్యాపారం పడిపోయింది. కనుక అతడు తన పనివాళ్ళనందరినీ ప్రోగుజేసికొనివచ్చి పౌలుమీద గలాటా లేవదీసాడు. ఎఫెసీయులు పౌలును చంపేకాడికి వచ్చారు. కాని అక్కడి పురపాలక ఉద్యోగులు దొమ్మీదారులను అణచివేసి పౌలు ప్రాణాలను కాపాడారు - ఆచ 19, 23-41

8. పదవీ వ్యామోహం

నరులకు పట్టే ఓ దుర్బుద్ధి పదవీకాంక్ష పేరు ప్రతిష్టల కాసపడి జనులు అందనిపండ్లకు ఆర్రులు చాచుతారు. చివరకు ఎంత పైకి లేవాలనుకొన్నారో అంతక్రిందికి పడిపోతారు.

1. పిశాచం ఏవను మభ్యపెట్టి తినగూడని చెట్టుపండు తినమని దురోధచేసింది. ఆలాతింటే మీరూ మంచిచెడ్డలు తెలిసికొని దేవళ్ళాఐపోతారు ఆంది. ఏవకు ఆ పండ్లమీద