పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10. యూదా క్రీస్తుని పట్టియిూయడానికై యూదనాయకులను గెత్సెమని తోపునకు తీసికొనివచ్చాడు. తానెవరిని ముద్దు పెట్టుకొంటే అతన్ని పట్టుకొమ్మని శత్రువులకు ముందుగనే ఆనవాలిచ్చాడు. బయటికిమాత్రం గురుభక్తి కలవాళ్లాగా నటిస్తూ గురువా నమస్కారమని క్రీస్తును ముదుపెట్టు కొన్నాడు, క్రీస్తు ఆతన్నేమీ నిందించలేదు. ఆ యానవాలు ప్రకారం శత్రువులు క్రీస్తును బంధించి తీసికొనిపోయారు - మత్త 26; 49-49.

11. పసిబిడ్డలను చంపించిన మొదటి హెరోదు మనుమడు మూడవ హెరోదు, ఇతడు యాకోబును చంపించాడు. పేత్రుని చెరలో వేయించాడు. తనవిజయాలను తలంచుకొని పొంగిపోతూ ఓమారు బంటులతో కొలువుతీర్చాడు. తన గొప్పతనాన్ని ప్రకటించుకొంటూ వాళ్ళముందు_ఓ ఉపన్యాసమిచ్చాడు. కొలువుకాళ్ళ అతని మెప్పపొందడంకోసం " నీవు నరమాత్రుడివికావు. ఓ దేవుడిలా మాట్లాడావు సుమా!" అని పొగడారు. ఆ పొగడ్డలకు హెరోదు బలూనులాగ ఉబ్బిపోయాడు. అతడు తన్నుతాను దేవుణ్ణిగా భావించుకొన్నందులకై ఓ దేవదూత అక్కడికక్కణ్ణే అతన్ని ఘోరంగా శిక్షించాడు. దానితో హెరోదు రోగపీడితుడై పురుగులుపడి చచ్చాడు - ఆచ 12, 21-23.

3. వ్యభిచారం

స్త్రీ పురుషులు జంతుదృష్టితో ఒకరినొకరు కామిసూంటారు. ఏవేవో మాయోపాయాలుపన్ని ఒకరి దేహాన్నొకరు అనుభవింప జూస్తూంటారు. బైబులు ఈలాంటి దుష్టచేష్టలను కొన్నింటిని ఉదాహరిస్తుంది.

1. యోసేపు ఐగుప్తున పోతీఫరు అనే సైన్యాధిపతి ఇంటిలో వుండేవాడు. అతని భార్యకు యోసేపుపై కోరిక పట్టింది. అతన్ని పాపకార్యానికి పురికొల్పింది. యోసేపు “అమ్మా! యజమానుడు ఈ యింటికంతటికీ నన్ను అధిపతిని జేసాడు. నీవు యజమానుని భార్యవు కనుక నిన్ను మాత్రం నా కప్పగింపలేదు. నేను స్వామి ద్రోహం చేయను, దేవుడు చూస్తూండగా ఇంతటి చెడ్డపనికి ఒడిగట్టను" అని ఆమెను మందలించాడు, ఆమె చెంతకు పోవడంగూడ మానివేసాడు. అయినా యజమానునిభార్య అతన్ని నిర్బంధంచేసింది. ఆ నిర్బంధానికి గూడ లొంగకపోగా ఆమె అతని మీద నేరం మోపింది. అతన్ని చెరలో త్రోయించింది - ఆది 39, 7-10.

2.యూదులు బాబిలోను ప్రవాసంలో వున్నపుడు ఇద్దరు వృద్దులను న్యాయాధిపతులనుగా నియమించారు. వీళ్ళిద్దరూ సూసన్న అనే ఉత్తమ కుటుంబినిని కామించి ఆమెను చెరచాలనుకొన్నారు. ఓమారు వాళ్ళిద్దరూ ఆమె తోటలో దాగుకొని