పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. పిశాచం తొలి నరదంపతులనుజూచి అసూయపడింది. తాను పోగొట్టుకొనిన భాగ్యం నరులకు అబ్బడంజూచి సహించలేకపోయింది. అది "మీరు ఏచెట్టుపండూ తినగూడదట నిజమేనా?” అని ఏవనడిగింది. ఏవ "తోటనడుమనున్న చెట్టుపండు మాత్రం తినకూడదు. అది తింటే మేము చనిపోతాం" అంది. పిశాచం " ఆ చెట్టపండుతింటే మీరు దేవుడంతటివారెపోతారు. పాపం ఈ రహస్యం మీకు తెలీదు” అని ఏవను ఉబ్బించింది. ఆదామేవలు పిశాచంమాట విని పండుతిని భ్రష్టులైపోయారు. ఈవిధంగా దయ్యం ఆదిదంపతులను వంచించింది - ఆది 3:1-6. 2.

యూదుల తండ్రులు తాము చనిపోకముందు పెద్దకొడుకును దీవించేవాళ్ళ ఆ దీవెన ఫలించేది. ఈసాకు చనిపోకముందు తన పెద్దకొడుకయిన ఏసావును దీవించాలనుకొన్నాడు. ఏసావును అడవికిపోయి వేటమాంసం తెచ్చి తనకు వండిపెట్టమన్నాడు. కాని అతడు తిరిగిరాకముందే యాకోబు మాంసం వండుకొనివచ్చి యేసావువలె నటించి తండ్రి దీవెన పొందాడు. ఏసావు వేటనుండి తిరిగివచ్చి సంగతి తెలిసికొని యెంతో విలపించాడు. "నాన్నా! నాకు కూడ ఈయడానికి నీవద్ద మరో దీవెన లేదా?" అని దీనంగా అడిగాడు. కాని లాభం లేకపోయింది, తండ్రిదీవెన ఫలించేది ఒక్కసారి మాత్రమే. ఈ విధంగా యాకోబు ఏసావును వంచించాడు– ఆది 27, 18-27.

3. యాకోబు తన అన్నయైన ఏసావునుండి పారిపోయి మేనమామయైన లాబానునింట ఆశ్రయంపొందాడు. ఈలాబానునకు లెయా,రాహేలు అని ఇద్దరుకుమార్తెలు ఉండేవాళ్ళ యాకోబు రాహేలును పెండ్లియాడగోరి మేనమామకు ఏడేండ్ల జీతం చేసాడు. గడువుకాస్త ముగిసాక లాబాను మేనల్లునకు రాహేలు నిస్తున్నట్లే నటించి లెయానిచ్చి పెండ్లిచేసాడు. రాత్రి ఆ యువతిని కూడిన పిదపగాని యాకోబునకు ఆమె లెయాయని తెలియలేదు. అతడు అదేమనగా లాబాను పెద్ద పిల్లకు పెండ్లికాకముందు చిన్నపిల్లకు పెండ్లిచేయడం మా దేశాచారంకాదు అన్నాడు. తరువాత లాబాను రాహేలునుగూడ యాకోబునకిచ్చిపెండ్లిచేసాడు. కాని అతడు రాహేలుకోసం ఇంకో యేడేండ్లు మేనమామకు జీతం చేయవలసివచ్చింది. ఇవి పెండ్లి సందర్భాలలో జరిగే వంచనలు - ఆది 29, 16-28.

4. యోసేఫనిన అతని సోదరులకు గిట్టేదికాదు. వాళ్ళు అతన్ని ఐగుప్త వెళ్ళే వర్తకులకు అమ్మివేసారు. కాని తండ్రికి ఏమి చెప్పాలి? ఆ సోదరులు ఓ పన్నాగం పన్నారు. ఓ మేకపిల్ల నెత్తుటిలో యోసేపు అంగీనిముంచి దాన్ని తండ్రి వద్దకు పంపించారు. అడవిలో ఆ నెత్తురుగుడ్డ తమ కంటపడిందని చెప్పించారు. యాకోబు ఏ మాయదారి మృగమో యోసేపును మింగివేసిందని తలంచి చాల బాధపడ్డాడు. కొడుకు మీద ఆశవదలుకొన్నాడు - ఆది 37, 31-82.