పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. అసూయ

నరులు సులభంగా అసూయకు గురౌతూంటారు. అల్పబుదులు ఇతరుల వృద్ధినిచూచి ఓర్చుకోలేక కీడు తలపెడుతుంటారు. బైబులు అసూయపరుల ఉదంతాలను చాల పేర్కొంటుంది.

1. కయీను హేబెలు అన్నదమ్ములు, కయీను పొలములో పండిన పంటను దేవునికి కానుకగా సమర్పించాడు. హేబెలు గొర్రెపిల్లలను కానుక పెట్టారు. ప్రభువు కయీను కపటబుద్ధినిచూచి అతని కానుకను నిరాకరించాడు. హేబెలు సరళబుద్ధికి మెచ్చుకొని అతని కానుకను అంగీకరించాడు. ఇకనేమి, కయీనుకు హేబెలు మీద కన్నుకుట్టింది. అతడు తమ్మడ్డి పొలానికి తీసికొనివెళ్ళి చంపివేసాడు - ఆది 4:3-8.

2. యాకోబుకు లెయా, రాహీలు అని యిద్దరు భార్యలు. వాళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్లు, లెయా కురూపి, రాహేలు సొగసుకత్తె, కాని దేవుని దయవలన పెద్దభార్యయైన లెయాకు బీరపూవుల్లాంటి పిల్లలు పట్టారు. చిన్నభార్య రాహేలు మాత్రం గొడ్రాలుగా వుండిపోయింది. ఆమె లెయా సంతానవతి కావడంజూచి కండ్లల్లో నిప్పలు పోసికుంది. నాకు గూడ పిల్లలను పుట్టిస్తావా లేక నన్ను చావమంటావా అని భర్తమీద విరుచుకపడింది. నీకు బిడ్డలనీయడానికి నేనేమి దేవుణ్బయేమిటి అని యాకోబు తప్పకొన్నాడు. తరువాత దేవుడు రాహేలు మొర ఆలకించి ఆమెకు యోసేపు, బెన్యామీను అనే బిడ్డలను ప్రసాదించాడు - 30: 1-2,

3. యాకోబుకు పండైండుమంది కుమారులు. కాని అతనికి ఇతర కుమారుల మీదకంటే యోసేపుమీద ఎక్కువ ప్రేమ. ఆ కుమారునికి ఓ పొడుగుచేతుల నిలువుటంగీని కుట్టించాడు. అది చూచేటప్పటికి యేసేపు సోదరులకు కడుపు మండింది. వాళ్ళు అతనితో మాటలాడ్డం మానేసారు. తరువాత సోదరులు యోసేపని అడవిలోని ఓ గోతిలో పడద్రోసారు. మళ్ళా అతన్ని ఆ గోతిలోనుండి పైకిలాగి యిష్మాయేలు వర్తకులకు అమ్మివేసారు. వాళ్ళు యోసేపును ఐగుప్తనకు తీసికొని వెళ్ళారు - ఆది 37: 3-4; 19-28,

4. ప్రభువు మోషేను యిప్రాయేలు ప్రజలకు నాయకుణ్ణి చేసాడు. అతడు ప్రజను ఐగుపునుండి నడిపించుకొని పోతున్నాడు. మోషే అన్న అక్క అయిన అహరోను మిర్యాములకు అతని పెద్దరికం నచ్చలేదు. వాళ్ళ చుప్పనాతితనంతో మోషే ఒక్కడే నాయకుడా? అతడొక్కడే ప్రవక్రా? మేము మాత్రంకామా? అని గొణిగారు, దానికి ప్రభువు మిర్యామును కుష్టరోగంతో పీడించాడు. తర్వాత మోషే ప్రార్ధన చేయగా మిర్యాముకు కుష్ట నయిమయింది. - సంఖ్యా 12:1-15.