పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1350 ప్రాంతంలోగాని క్రైస్తవ వేదాంతులు వివాహం ద్వారా ప్రత్యేక వరప్రసాదం లభిస్తుందనీ, అది యేడు దేవ ద్రవ్యానుమానాల్లో ఒకటనీ స్పష్టంగా తెలియజేయలేదు. 16వ శతాబ్దంలో లూతరూ అతని అనుయాయులూ వివాహం దేవద్రవ్యానుమానం కాదని వాదించారు. అది కేవలం తిరుసభ ఏర్పరచిన తంతుకనుక దాని వల్ల వరప్రసాదం లభించదన్నారు. దీనికి భిన్నంగా ట్రెంటు మహాసభ పెండ్లి యేడు సంస్కారాల్లో ఒకటని ధ్రువీకరించింది.

3. వివాహం సంస్కారమేనని చెప్పే బైబులు బోధలు

పూర్వవేదంలో దేవుడు సీనాయికొండదగ్గర యిప్రాయేలీయులతో నిబంధనం చేసికొన్నాడు. వారిని గాఢంగా ప్రేమించాడు. ఈ నిబంధనం స్త్రీ పురుషుల పెండ్లిలాంటిది అన్నారు ప్రవక్తలు. నిబంధనంద్వారా దేవుడు వరుడు, యిప్రాయేలు వధువు అయ్యారని చెప్పారు. ఈ నిబంధనం భావికాలంలో రాబోయే స్త్రీ పురుషుల ఐక్యతనుగూడ సూచిస్తుంది. క్రీస్తు సిలువమీద చనిపోయి తిరుసభను పత్నిగా పొందాడు. తిరుసభను గాఢంగా ప్రేమించాడు. నూత్నవేదంలో క్రీస్తు తిరుసభల పోలిక వధూవరులమీద సోకుతుంది. వారి పెండ్లిని సంస్కారంగా మార్చి వారికి వరప్రసాదాన్ని దయచేస్తుంది. క్రైస్తవ పరిణయంలో ఈ క్రీస్తు తిరుసభల పోలికే ముఖ్యమైంది.

క్రీస్తు వివాహ సంస్కారాన్ని ఎప్పుడు స్థాపించాడు? ప్రభువు కానాపూరి వివాహానికి హాజరై అక్కడి పెండ్లివారికి సహాయం చేసాడు - యోహా2. భర్త భార్యను పరిత్యజించడం న్యాయమేనా అని పరిసయులు అడిగినప్పడు అతడు విడాకులు చెల్లవని చెప్పాడు. దేవుడు జతపరచిన జంటను మానవమాత్రులు వేరుపరచగూడదు అన్నాడు-మత్త 19,6. ఈ సందర్భాలను పురస్కరించుకొని తిరుసభ క్రీస్తు హృదయాన్ని అర్థం చేసికొంది. ప్రభువు పరిణయాన్ని గూడ ఓ సంస్కారంగా పరిగణింపగోరాడని క్రమేణ గుర్తించింది. బైబులంతటిలోను ఎఫెసీయులు 5,21-33లో పౌలు చెప్పిన క్రీస్తు తిరుసభల పోలిక వివాహంగూడ ఓ సంస్కారమేనని అర్థంచేసికోవడానికి బాగా ఉపయోగపడుతుంది. తిరుసభ ప్రారంభంనుండి వివాహాన్ని దేవద్రవ్యానుమానంగా గణించకపోయినా దాన్ని ఓ పవిత్రకార్యంగా గుర్తిస్తూ వచ్చింది. ఒక దశలో అదికూడ దేవద్రవ్యానుమానమేనని గ్రహించింది. కనుక ప్రోటస్టెంటు సంస్కరణవాదులు వాదించినట్లు అది కేవలం తిరుసభ సృష్టించింది కాదు. క్రీస్తు స్వయంగా నెలకొల్పింది.

ప్రతి దేవద్రవ్యానుమానమూ ఉత్దానక్రీస్తు నెరవేర్చే పవిత్రక్రియ. తిరుసభ జరిపే ఓ సాంకేతిక క్రియ. దానిద్వారా ప్రభువు ఆన ఉత్థాన భాగ్యాలనుండి మనకు వరప్రసాదాన్ని