పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్థకు చెంది వుండడమైంది. ఆర్థిక లాభాలు పొందడమైంది. ఈ దృక్పథం మారాలి. ప్రతి విచారణ ప్రతి క్రైస్తవ సమాజం మేము వేదబోధకు పంపబడిన వాళ్ళం అనుకోవాలి. అవి లోకంలో పులిపిడి ద్రవ్యంగా తయారు కావాలి.

2. లోకంలో బోలెడంత దుష్టత్వముంది. క్రీస్తునీ సువిశేష విలువలనూ స్వీకరించిన క్రైస్తవులు ఈ విలువలను ప్రచారంచేసి ఆ దుష్టత్వాన్ని ప్రతిఘటించాలి. క్రైస్తవ సమాజమంతా క్రీస్తుకి సాక్ష్యంగా వుండి లోకంలోని పాపపు వ్యవస్థను నిర్మూలించాలి. గురువులూ ఉపదేశులూ మొదలైనవాళ్ళు మాత్రమేకాక విచారణలోని సంఘాలన్నీకూడ ఏదో రూపంలో సువిశేషబోధ చేసేవిగా వుండాలి.

3. ఆత్మ ప్రేరిత తిరుసభ

రెండవ వాటికన్ సభ తర్వాత పవిత్రాత్మ ఉద్యమం తిరుసభలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇది దైవకటాక్షం అనాలి. ఈ వుద్యమం ద్వారా పవిత్రాత్మ తిరుసభను నడిపిస్తుంది. క్రీస్తు రక్షణాన్ని లోకానికంతటికీ అందీయడం ఆత్మ పని. కనుక క్రీస్తు రక్షణం అందరికీ లభించేలా చూడ్డం ఈ వుద్యమంలో పనిజేసేవాళ్ళ బాధ్యత.

1. జ్ఞానస్నానం, భద్రమైన అభ్యంగనం పొందినవాళ్ళందరికీ ఆత్మ తన వరాలను దయ చేస్తుంది. వీటి ద్వారా మనం దైవరాజ్యాన్ని వ్యాప్తిచేస్తాం. కనుక ఒక్కొక్కరూ ఆత్మ తమకిచ్చిన వరాలను గుర్తించి వేదబోధకు ఉపక్రమించాలి. విశేషంగా గృహస్థుల వరాలకు విలువ నీయాలి. వీళ్ళ కూడ దైవరాజ్యాన్ని వృద్ధి చేస్తారు. దేవుని పిలుపు కూడ ఒక వరం. పెద్దలు ఈ వరాన్ని గుర్తుపట్టాలి.

2. ఈ వరాల ద్వారా తిరుసభ తన ప్రేషిత సేవను కొనసాగించుకొని పోతుంది. కనుక ఈ వరాలను ఓ క్రమ పద్ధతిలో సంఘటితం చేయాలి. ఇక్కడ రెండంశాలు ముఖ్యం. మొదటిది విచారణలోని వివిధ సేవా సమాజాలను క్రమబద్ధం చేయాలి. ఈ సమాజాల సభ్యులు ఆయా రంగాల్లో జరిగే దుష్టకార్యాలను ప్రతిఘటింపగలిగి వుండాలి. ప్రజలచే సత్కార్యాలు చేయించగలిగి వుండాలి. అవసరమైతే తగిన వరాలుగల వ్యక్తులతో నూత్న సేవా సమాజాలను స్థాపించాలి. వీళ్ళ నూతన సేవలు ప్రారంభిస్తారు. రెండవది, మఠ సమాజాలు. ఇవి ఆత్మ తిరుసభకిచ్చే వరాలు. తిరుసభ ప్రేషిత సేవకు ఉపయోగపడి తేనే నూత్నమఠసభల పట్టుకను అంగీకరించాలి. ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించిన పిదపనే నూత్న మఠసభలను స్థాపించాలి. మఠసభలు ఒక దానితో ఒకటి పోటికి దిగకూడదు. సభ్యులు అధికంగా గల మఠసభలు నూత్న కార్యాలను చేపట్టడానికి వెనుకాడకూడదు.