పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవలంబించి తిరుసభలో అసలు గురువర్గమే వుండకూడదన్నాడు. గురుపట్టమనే ప్రత్యేక దేవద్రవ్యానుమానమే లేదన్నాడు. తిరుసభ సభ్యులంతా గృహస్థులే అన్నాడు. లూతరు వర్గంవాళ్లు సంస్కరణ వాదులయ్యారు.

ఈ తీవ్రవాదాన్ని ఖండించడానికి క్యాతలిక్ సమాజం నుండి ప్రతిసంస్కరణ వాదులు ముందుకి వచ్చారు. వీళ్లు గృహస్టుల పాత్రను మరీ తగ్గించారు. వీళ్ళకు జ్ఞానస్నాన యాజకత్వంగూడ లేదన్నారు. గురువులుపొందే గురుపట్ట దేవద్రవ్యానుమానం స్థాయిని మరీ హెచ్చించారు.

రానురాను తిరుసభలో గృహస్థల స్థానం పూర్తిగా దిగజారిపోయింది. గృహస్థలు కేవలం లౌకికులు కనుక వాళ్ళకు దైవరాజ్యాన్ని బోధించి దాన్ని వ్యాప్తిచేసే బాధ్యత లేదనుకొన్నారు. సంసారులు గురువులనుండి ఆత్మరక్షణకు అవసరమైన సహాయాలూ వరప్రసాదాలూ పొందితేచాలు అనుకొన్నారు. ఈ విధంగా గృహస్తుల పాత్ర పూర్తిగా దిగజారిపోయింది. ఈ పరిస్థితే ఇంచుమించు రెండవ వాటికన్ సభవరకు కొనసాగుతూ వచ్చింది.

2. రెండవ వాటికన్ సభ బోధలు

రెండవ వాటికన్ సభ సాధించిన ముఖ్యకార్యాల్లో ఒకటి, గృహస్తుల స్థానాన్ని పునరుద్ధరించడం. తొలి శతాబ్దాల్లో గృహస్థలకున్నప్రాముఖ్యాన్ని ఈ సభ మళ్లా వెలుగులోకి తెచ్చింది. సంగ్రహంగా ఈసభ బోధలు ఇవి. గృహస్థలు జ్ఞానస్నానంద్వారా క్రీస్తు దేహమైన దైవప్రజలౌతారు. పరిపూర్ణంగా తిరుసభ సభ్యులౌతారు. వాళ్ళ పద్ధతిలోవాళ్లు క్రీస్తు యాజకత్వంలోను రాజత్వంలోను ప్రవక్తృత్వంలోను పాలుపొందుతారు. వాళ్ళకు చేతనైనట్లు వాళ్లు దైవరాజ్యబోధకూ దాని వ్యాప్తికీ పూనుకొంటారు. గురువులు ఆధ్యాత్మిక రంగంలో కృషిచేస్తూ దైవరాజ్యాన్ని వ్యాప్తిచేస్తారు. పులిపిడి పదార్థం పిండిని పొంగజేస్తుంది. అలాగే గృహస్థలు లౌకికరంగంలో పలిపిడి పదార్థంలా పనిచేస్తూ ప్రాపంచిక విషయాలను పునీతం చేస్తారు.

గృహస్తులకుకూడ ప్రేషిత సేవచేసి దైవరాజ్యాన్ని వ్యాప్తిచేసే హక్కువుంది. ఈ హక్కువాళ్ళకు తిరుసభలోని అధికారులైన గురువులు బిషప్పలు మొదలైన వాళ్ళనుండిరాదు. జ్ఞానస్నానంనుండే వస్తుంది. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందడంద్వారా వీళు యాజకులౌతారు. గురువులది దేవద్రవ్యానుమాన సేవకొరకు ఉద్దేశింపబడిన ప్రత్యేక యాజకత్వం. గృహస్టులది జ్ఞానస్నానంవల్ల එබීරඹී సామాన్యయాజకత్వం, ఆ యాజకత్వం