పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవుని మీదనే ఆధారపడి జీవించేవాళ్లు, గురువులు విశేషంగా దేవద్రవ్యానుమానాల సేవకూ, పూజబలిని అర్పించడానికీ, ఉద్దేశింపబడినవాళ్లు, ఈ సేవకుగాను వీళ్లకు గురుపట్టం అవసరమైంది. ఇక గృహస్తులు లోకంలో జీవిస్తూ లోక వ్యవహారాలను పట్టించుకొంటూ తమ రక్షణ కార్యాన్ని తాము చూచుకొనేవాళ్లు, కనుక వీళ్లను లౌకికులు అన్నారు.

క్రమేణ పై గురువులూ సన్యాసులూ కలసిపోయి ఏక వర్గమయ్యారు. గృహస్టులు ఏకవర్గమయ్యారు. కనుక తొమ్మిదవ శతాబ్దం నుండి రెండు వర్గాల ప్రజలు వుండేవాళ్లు, గురువర్గం మతవిషయాలు చూచుకొనేది. గృహస్థ వర్గం లౌకిక విషయాలు పట్టించుకొనేది కాలక్రమేణ గురువర్గంలోనివాళ్లు విద్యావంతులుగా చలామణి అయ్యారు. వాళ్లు వేద శాస్త్రాలూ లౌకికశాస్త్రాలూ కూడ బోధించేవాళ్లు, గృహస్థ వర్గంలోనివాళ్లు అవిద్యావంతులుగా చలామణి అయ్యారు. వాళ్ళ కేవలం లోకజీవనం గడిపేవాళ్లు, 12వ శతాబ్దానికల్లా గృహస్థల్లో అవిద్య ఇంకా పెరిగింది. వాళ్ళ విలువకూడ తగ్గింది. చదువు లేకపోవడమే దీనికి కారణం.

12వ శతాబ్దంలో వర్ధిల్లిన గ్రేష్యన్ అనే తిరుసభ న్యాయశాస్త్రవేత్త “దేవుణ్ణి తమ పాలుగా ఎన్నుకొని దైవరాజ్యంకొరకు జీవించేవాళ్లు గురువులు. వీళ్లు ఇతరులకు నీతినీ ధర్మాన్నీ బోధిస్తారు. లోకాన్ని తమ పాలుగా ఎన్నుకొని లోకవ్యవహారాల్లో జీవించేవాళ్ళ లౌకికులు. వీళ్ళ పాపాన్ని విడనాడితే రక్షణను పొందవచచ్చు” అని వ్రాసాడు.

గురువులు దైవకార్యాల్లో నిమగ్నులౌవుంటారు. కనుక వీళ్ళను "ఆధ్యాత్మిక వర్గం" అన్నారు. గృహస్తులు ఇహలోక కార్యాల్లో నిమగ్నులై వుంటారు కనుక, వాళ్ళను "లౌకిక వర్గం" అన్నారు. క్రమేణ గురుజీవితం మాత్రమే ఆదర్శవంతమైంది, అది మాత్రమే క్రీస్తుని అనుసరించేది అనే భావం ప్రచారంలోకి వచ్చింది. బ్రహ్మచారులుగావుండి గురుజీవితం గడపడానికి శక్తి లేనివాళ్ళు దానికంటి తక్కువస్థాయికి చెందిన గృహస్థ జీవితం గడపవచ్చు అనే అభిప్రాయంకూడ వ్యాప్తిలోకి వచ్చింది. కనుక ఆదర్శవంతమైంది గురుజీవితం, దాన్ని అందుకోలేనివాళ్లు గృహస్థలుగా వండిపోతారు, వీళ్ళస్థాయి తక్కువది. గురుజీవితం బలవంతుల కొరకు, బలహీనులకు సంసారజీవితం. సంసారులు లోక వ్యవహారాల్లో వుండేవాళ్లు కనుక వాళ్ళకు మతపరమైన పవిత్రకార్యాలతో సంబంధంలేదు. 12వ శతాబ్దంలో వ్యాప్తిలోవున్న భావాలు ఇవి.

ఇక, గురుజీవితం గొప్పది గృహస్టుల జీవితం తక్కువది అనేభావాన్ని 16వ శతాబ్దంలో లూతరు సవాలుచేసాడు. అప్పటికి తిరుసభతో గురువర్గం ప్రాముఖ్యం బాగా ప్రబలిపోయింది. గృహస్థల ప్రాముఖ్యం బాగా తగ్గిపోయింది. కాని లూతరు తీవ్రవాదాన్ని