పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రైస్తవులంతా క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినవాళ్లే ఈ జ్ఞానస్నానం ద్వారానే మనం తిరుసభలో చేరతాం. జ్ఞానస్నానం ద్వారా అందరమూ క్రీస్తు యాజకత్వంలో పాలుపొందుతాం - 1పేత్రు 2,9-10. జ్ఞానస్నానం పొందిన వాళ్లందరికీ జ్ఞానస్నాన యాజకత్వం వుంటుంది. ఈ జ్ఞానస్నాన యాజకత్వం ద్వారా మనమందరమూ సరిసమానులమౌతాం. కనుకనే అగస్టీను భక్తుడు ఆనాటి ప్రజలనుద్దేశించి "మితోపాటు నేనూ క్రైస్తవుట్టే ఐనా మిూ కొరకు నేను పీఠాధిపతిని" అని చెప్పాడు. ఓ వ్యక్తి గురువో బిషప్పో ఐనపడు క్రైస్తవుడు కాకుండా వుండడు. జ్ఞానస్నానం ద్వారా అతడు తోడి క్రైస్తవులకు సరిసమానుడౌతాడు. కాని యాజకత్వం ద్వారా తోడి క్రైస్తవులకు అధికుడౌతాడు. ఐనా తిరుసభ గురువులదీ బిషప్పలదీ పోపుగారిదీ మాత్రమే కాదు. క్రైస్తవులందరిదీకూడ. తిరుసభ సభ్యులందరికీ ఓ సామన్య బాధ్యత వుంది. అది దైవరాజ్య వ్యాప్తి. ఈ బాధ్యత ద్వారా తిరుసభలోని సభ్యులంతా సరిసమానులే ఔతారు. మనందరికీ ఒకే ప్రభువు, ఒకే జ్ఞానస్నానం, ఒకే విశ్వాసం వున్నాయి - ఎఫె 4,5. క్రీస్తులోనికి ఐక్యమైన ప్రజల్లో జాతి లింగ వర్గభేదాలు లేవు - గల 3,28.


తిరుసభలోని ప్రజలందరూ విలువలో సరిసమానులైనా వారిలో వివిధ అంతస్తులున్నాయి. మొదటి అంతస్తు గృహస్తులది. కనుక మొదట వారిని గూర్చి విచారిద్దాం.

1. చారిత్రకంగా గృహస్తుల పాత్ర

గృహస్థులు తిరుసభకు చెందినవాళ్లు మాత్రమే కాదు. వాళ్లకూడ తిరుసభే. గృహస్తులంటే ఎవరు? తిరుసభలో గురువులూ మఠసభలకు చెందినవాళూ వున్నారు. ఈ రెండు వర్గలకు చెందని వాళ్ళంతా గృహస్టులే.

క్రైస్తవ సమాజంలో గృహస్కల పాత్ర శతాబ్దాల పొడుగున క్రమేణ దిగజారిపోయింది. ఆ వైనాన్ని క్లుప్తంగా తెలిసికొందాం.

తొలి రెండు శతాబ్దాల్లో తిరుసభలో యాజకులు సామాన్య క్రైస్తవులు అని రెండు వర్గాల ప్రజలు మాత్రమే వుండేవాళ్ళు ఈ వ్యభయ వర్గాలకు విలువలో తేడాలేదు. వీళ్ళ చేసే పనుల్లో మాత్రం వ్యత్యాసముండేది.

మూడవ శతాబ్దానికల్లా సన్యాసులనే మరో వర్గం వచ్చింది. వీళ్ళు నేడు మఠసభలకు చెందినవారితో సమానం. సన్యాసులు లోకం కొరకుగాక దేవునికొరకు జీవించేవాళ్లు లోక వ్యామోహాలను వదలుకొన్నవాళ్లు కనుక వీళ్ల జనావాసాలకు దూరంగా, ఏకాంతంగా వసించేవాళ్లు.వీళ్ళ పాలు లోకవస్తువులు కాదు, ప్రభువే. కనుక వీళ్లు