పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్థనా భావాలు

1.క్రీస్తు అంగీని కుట్ల లేకుండ ఏకవస్త్రంగా నేసారు. సైనికులు అతని వస్తాలను నాల్లు భాగాలుగా విభజించి తమలోతాము పంచుకొనేపడు ఆ యంగీని చించలేదు. అదృష్టపు చీట్లు వేయగా అది సైనికుల్లో ఒకరికి వచ్చింది. యోహా 19,23-24. ప్రాచీన వేదశాస్తులు ఈ కుట్టలేని అంగీని తిరుసభతో పోల్చారు. క్రీస్తు ధరించిన అంగీలాగే తిరుసభ కూడ ఐక్యతా భావం కలది. దానిలో శాఖలు ముఠాలు విభేదాలు వుండకూడదు.
2.చాలమంది క్రైస్తవులకు తిరుసభనుండి తీసికోవడం మాత్రమే తెలుసు. వీరి దృష్టిలో తిరుసభ పెద్ద సాంఘిక సంక్షేమ సంస్థ. దీన్ని ఆసరాగా బెట్టుకొని పొట్టబోసికోవచ్చు, వుద్యోగాలు సంపాదించుకోవచ్చు, పేరు తెచ్చుకోవచ్చు అని వీళ్ళ భావన. వీళ్ళ వట్టి స్వార్థపరులు. మంచి క్రైస్తవుడు తిరుసభనుండి తీసికొనేపుడు తీసికొన్నా ఇచ్చేపుడు ఇస్తాడు. అతడు తిరుసభ వ్యాప్తికి తోడ్పడతాడు. దానికి సేవలు చేస్తాడు. దాన్ని తల్లిగా భావించి దానిపట్ల అభిమానంతో మెలగుతాడు.
3.మన తిరుసభ విదేశాల ధనసహాయంమిూద అతిగా ఆధారపడుతూంది. ఏకారణంచేతనైనాసరే ఈ ధనసహాయం ఆగిపోతే తిరుసభ కుప్పకూలిపోతుంది. కనుక ఈలా ఆధారపడ్డం చెడ్డపద్ధతి. మన సామాన్యావసరాలకు మనదేశంలోని క్రైస్తవులే ధనసహాయం చేసికోవాలి. మనకాళ్ళమిూద మనం నిలబడాలి. అప్పడే తిరుసభ ఈ దేశంలో వేళ్ళబాతుకొని అభివృద్ధి చెందేది.

8. తిరుసభలో గృహస్తులు

ఇంతవరకు తిరసభ ఆంతరంగిక స్వభావాన్ని పరిశీలించి చూచాం. ఇకవిూడట తిరుసభలోని వివిధ వర్గాల ప్రజలను గూర్చి విచారించాలి. తిరుసభ క్రీస్తు శరీరమని ముందే చెప్పాం - 1కొరి 12,27. ఈ శరీరంలో వివిధ అవయవాలున్నాయి. అన్ని అవయవాలు దేహం శ్రేయస్సు కొరకే పనిచేస్తాయి. ఈ అవయవాలే వివిధవర్గాలప్రజలు. వీరిని గూర్చి మనం క్షుణ్ణంగా తెలిసికోవాలి.

తిరుసభ దైవప్రజలతో కూడింది. ఈ ప్రజలంతా క్రీస్తుచే రక్షించబడినవాళ్లు, అతన్ని విశ్వసించేవాళ్ళు అతనిచే దైవరాజ్య బోధకు పంపబడినవాళ్ళు ఈ దృష్టితోజూస్తే ఈ ప్రజలంతా సరిసమానులే. గురువులూ గృహస్థలూ అందరికీ ఒక్కటే విలువ.