పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపోస్తలులు తమనాడు క్రీస్తునీ అతని మరణోత్తానాలనూ అతని సందేశాన్నీ నానాజాతులకు బోధించారు. అది వారి సువిశేషబోధ. నేడు తిరుసభకూడ ఈయపోస్తలుల బోధనే కొనసాగించాలి. అది ఈ కార్యాన్ని విశ్వసనీయంగా నెరవేర్చాలి. ఈ కార్యంలో కల్లీ వుండకూడదు. అనగా తిరుసభ లోక విలువలకు లొంగకుండా స్వచ్ఛమైన క్రీస్తు విలువలనే ప్రచారం చేయాలి.

సువిశేషబోధ సేవాకార్యం. ఈ సేవను తిరుసభ వొళ్ళు దగ్గర పెట్టుకొని నిర్వహించాలి. తిరుసభ అధికార దాహానికి లొంగకుండా నిరంతరం సేవక తిరుసభగా మెలగాలి. దాని లక్షణం ఊడిగం చేయడంకాని దొరతనం కాదు. ఇంకా అవసరమైతే తొలి అపోస్తలులలాగే నేటి తిరుసభకూడ కొన్ని వేదహింసలు అనుభవించాలి.

తిరుసభ సభ్యులంతా తొలి పండ్రెండు మంది శిష్యులకు వారసులే. పవిత్రాత్మ మనలను ఆ తొలి నాయకులకు వారసలనుగా జేసి నేడు మనమూ వారి సేవను కొనసాగించేలా చేస్తుంది. కాని ఇది విస్తృతార్థంలో మాత్రమే.

ఖండితార్థంలో పీఠాధిపతుల బందం మాత్రమే తొలి పండ్రెండుమంది ప్రేషితులకు వారసులు. పోపుగారుకూడ ఈ బృందంలోకే వస్తారు. వీళ్లు మాత్రమే అపోస్తలుల పారంపర్యాన్నీ అధికారాన్నీ బోధనీ సేవనీ కొనసాగించేవాళ్లు, వీళ్ళే నేటి తిరుసభను నడిపించే నాయకులు.

ఇప్పటి బిషప్పలు ఏవొక్క ప్రత్యేక అపోస్తలునికి కాక ఉమ్మడిగా అపోస్తలులందరికీ కలిసి వారసులౌతారు. తొలి అపోస్తలులందరికీ విశ్వసనీయులైన వారసులుగా వుండడం బిషప్పల ప్రధానధర్మం. అనగా తొలి పండైండుమంది విశ్వాసమే బిషప్పలకీ వండాలి.

క్యాతలిక్ తిరుసభ అపోస్తలుల తిరుసభకు వారసంగా వచ్చింది అని చెప్పాం. రెండవ శతాబ్దంలోనే ఇరనేయస్ అనే వేదశాస్త్రి అపోస్తలుల తర్వాత రోమాపురికి బిషపులుగా పనిజేసినవాళ్ళ జాబితాను తయారుచేసాడు. వీళ్ళనే ఇప్పుడు మనం పోపుగార్లు అంటున్నాం. ఈ పోపుగార్లు అపోస్తలుల తర్వాత అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వచ్చారు. వాళ్ళ నడిపించేదే నేటి మన తిరుసభ.

8వ శతాబ్దంలో ఏర్పడిన గ్రీకు క్రైస్తవశాఖల్లో కాని, 16వ శతాబ్దంలో ఏర్పడిన ప్రొటస్టెంటు శాఖల్లోకాని ఈలా తొలి అపోస్తలులతో సంబంధం కలిగివుండడం అనే • లక్షణంలేదు, ఇది క్యాతలిక్ తిరుసభకు ప్రత్యేకం.