పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. విశ్యవ్యాప్తత

విశ్వాస సంగ్రహంలో "కతోలిక తిరుసభను విశ్వసిస్తున్నాను” అంటాం. "కతోలికోస్" అనేది గ్రీకుమాట. ఈ పదానికి విశ్వమంతట వ్యాపించి వున్నది అని అర్థం. అన్ని తావుల్లోను వ్యాపించి వుండడమనేది తిరుసభ రెండవ లక్షణం.

బైబులు బోధలను పరికిస్తే, ప్రభువు అబ్రాహాం ద్వారా అన్ని జాతులు దీవెనలు పొందుతాయని ఆదికాండంలోనే ప్రమాణం చేసాడు - ఆది 12,3. ఉత్తాన క్రీస్తు మిూరు వెళ్ళి ప్రపంచమందంతటా, అందరు ప్రజలకూ సువార్తను బోధించండి అని చెప్పాడు మార్కు 16,15. ఇంకా అతడు మిూరు భూదిగంతాల వరకూ నాకు సాక్షులుగా వుంటారు — అనగా నన్ను గూర్చి బోధిస్తారు అని చెప్పాడు - అ, చ.1-8. తొలిరోజుల్లోనే పౌలు ఆనాటి యూరపు ఖండమంతటా వేదబోధచేసి సకలజాతి ప్రజలను విశ్వాసరంగంలో క్రీస్తుకి విధేయులనుగా జేసాడు - రోమా 1,5. ఈ విధంగా తిరుసభ తాను పుట్టినప్పటినుండి అన్ని జాతుల్లోను వేళ్ళపాతుకొంది.

విశ్వవ్యాప్తతలో మూడంశాలున్నాయి. 1. తిరుసభ అన్ని తావుల్లోను వ్యాపించి వుండాలి. 2. అన్ని కాలాల్లోను వ్యాపించి వుండాలి. 3. తిరుసభ అన్ని కాలాల్లోను అన్ని తావుల్లోను ఒకే విశ్వాసాన్ని సంపూర్ణంగా బోధించి వుండాలి.

ఈ లక్షణాలు క్యాతలిక్ తిరుసభకు చాలవరకు వర్తిస్తాయి. ప్రారంభంనుండే అది అన్ని తావుల్లోను, అన్ని శతాబ్దాల్లోను వ్యాపిస్తూ వచ్చింది. లోకంలోని నరులందరూ కాకపోయినా చాలమంది దానిలో చేరారు. ప్రారంభంనుండే అన్ని తావుల్లో కాకపోయినా అది చాలా తావుల్లో వ్యాప్తి చెందింది. తొలి శతాబ్దాలనుండి తిరుసభ ముఖ్యమైన బోధ ఒకే విధంగా వుంది. కాని ఆయా కాలాల్లోని సమస్యలను పరస్కరించుకొని తిరుసభ బోధల్లో నూత్న విషయాలు చేరుస్తూ వచ్చారు. కనుక ఆ బోధ కాలక్రమేణ పెరుగుతూ వచ్చింది.

8వ శతాబ్దంలో గ్రీకు క్రైస్తవులూ, 16వ శతాబ్దంలో ప్రోటస్టెంటు క్రైస్తవులూ ఆదిమ తిరుసభనుండి చీలిపోయి క్రొత్త క్రైస్తవశాఖలను ఏర్పరచుకొన్నారు, ఈలా చీలిపోయిన శాఖలకు పై విశ్వవ్యాప్తత అనే లక్షణం అంతగా వర్తించదు. అవి కొన్ని కాలాల్లో కొన్ని తావుల్లో మాత్రమే ఉన్న శాఖలు.

విశ్యవ్యాప్తత అనేది ఉత్తానక్రీస్తు అతని ఆత్మా తిరుసభకు దయజేసిన వరం. ఆత్మ అన్ని కాలాల్లోని ప్రజలకు అన్ని తావుల్లోని ప్రజలకు క్రీస్తుని ప్రత్యక్షం చేస్తుంది. దీనివల్ల తిరుసభ అంతటా వ్యాపించింది, అన్ని జాతులవాళ్లు ఆ సభలోచేరి తమ ప్రత్యేక