పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కడన, క్రైస్తవ సమాజాన్ని దేవాలయంగా వర్ణించే పౌలు బోధలను రెండింటిని తిలకిద్దాం. మొదటిది 1కొ 3,16-17. "విూరు దేవుని ఆలయమనీ, దేవుని ఆత్మకు నివాసమనీ మియాకు తెలియదా? మిూరే దేవుని ఆలయం", ఇక్కడ పౌలు పేర్కొనే ఈ ఆలయం కొరింతులోని క్రైస్తవ సమాజం. ఆత్మ కొరింతు ప్రజల్లో వసిస్తూంది కనుక వాళ్లు దేవాలయమయ్యారు. కోరింతు క్రైస్తవుల లోపాలు వారికున్నాయి. ఐనా ఉత్థానక్రీస్తూ అతని ఆత్మా వారిలో నెలకొని వున్నారు. వారిని దేవాలయం చేసారు. పూర్వం దేవుని సాన్నిధ్యం యెరూషలేములోని రాతిగుడిలో వుండేది. ఇప్పడు ఆ సాన్నిధ్యం క్రైస్తవ సమాజంలో వుంటుంది. ఇక ఆ రాతిగుడితో పనిలేదు. ఇప్పడు ప్రజలే ఆధ్యాత్మిక దేవాలయం. కొరింతు క్రైస్తవ సమాజమే దేవాలయం గనుక, ఆ సమాజంలోని ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. వారిలో వుండేది పవిత్రమైన దైవసాన్నిధ్యం గనుక వాళ్ళ జీవితంగూడ పవిత్రంగా వుండాలి.


1 కొరింతీయులు 6,19 ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగతంగా కూడ దేవాలయమేనని చెప్పంది. కాని పౌలుకి ఈ వ్యక్తి అనేది ముఖ్యాంశం కాదు, సమాజంలోని ఆత్మసాన్నిధ్యమే వ్యక్తిలోకి వస్తుంది. అతని ప్రధాన భావం, సమాజమే దేవాలయమనేది. రాతిగుడికి బదులుగా సమాజ దేవాలయం వచ్చింది అనేది అతని నూత్నభావం. ఇక్కడ కొరింతులోని స్థానిక తిరుసభను పౌలు దేవాలయంగా వర్ణించాడు. ఈలాంటి స్థానిక తిరుసభలను అతడు చాల స్థాపించాడు. అవన్నీ దేనికది దేవాలయాలే.

ఇక, పౌలు ఒక్క స్థానిక తిరుసభనే కాక తిరుసభ నంతటినీ ఆత్మకు ఆలయంగా పేర్కొన్న వేదభాగం ఎఫెసీయులు 2,18–22. ఇక్కడ అతడు క్రైస్తవ సమాజాన్నంతటినీ ఓ దేవాలయంగా వర్ణించాడు. ఈ దేవాలయానికి ప్రవక్తలూ అపోస్తలులూ కలసి పునాది ఔతారు. క్రైస్తవ సభ్యులంతా దేవాలయ నిర్మాణంలో వాడిన శిలలు ఔతారు. ఈ శిలల్లో యూదక్రైస్తవులూ అన్యజాతి క్రైస్తవులూ కూడవున్నారు. క్రీస్తు ఈ దేవళానికి మూలరాయి. ఈ రాయి పునాదిలో కాక భవనం కప్పలో వుంటుంది. భవనాన్నంతటినీ కలిపి వుంచుతుంది. ఈ మందిరంలో దేవుడు తన ఆత్మద్వారా నెలకొని వుంటాడు. కనుకనే ఇది దేవాలయమైంది. ఆత్మే ఈ దేవాలయన్ని పదిలంగా కాపాడుతుంది. ఇక, పూర్వవేదంలో యూదులు ప్రధానంగా దేవుణ్ణిస్తుతించి కీర్తించడానికి వున్నారు - యెష48,21. అలాగే నూత్నవేద యిప్రాయేలైన క్రైస్తవులు కూడ క్రీస్తుద్వారా తండ్రిని స్తుతించడానికే వున్నారు. ఈ స్తుతి క్రైస్తవ సమాజంలో జరగాలి. ఈ సమాజం యూదులతోను అన్యజాతి వాళ్లతోను కూడిన భక్తబృందం. ఈ భక్తబృందంలో $(3%oסח జ్ఞానస్నానం దివ్యసత్ర్పసాదం అనేవాటిద్వారా ఈ స్తుతీ ఆరాధనా కొనసాగుతాయి. ఆత్మయందు క్రీస్తుద్వారా తండ్రికి ఈ యూరాధనం జరుగుతుంది.