పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. తిరుసభలో మఠవాసులుకూడ ఓ వర్గం. గురువుల వర్గంనుండీ సహోదరుల వర్గంనుండికూడ సభ్యులు ఈ మఠవాసుల్లో చేరతారు. వీళ్లు దారిద్ర్యం విరక్తత్వం విధేయత అనే వ్రతాలద్వారా దేవునికి పరిపూర్ణంగా నివేదితులౌతారు. సేవామార్గాన్ని చేపట్టి తిరుసభ అభివృద్ధి కొరకు నిరంతరం కృషిచేస్తారు. నిర్మలజీవితం గడుపుతూ తిరుసభ పావిత్ర్యానికి గురుతుగా వుంటారు. వీరి కృషివల్ల తిరుసభ ఇంకా అభివృద్ధిలోకి రావాలని ప్రార్థిద్దాం.

6. తిరుసభకు ఉపమానాలు

ఓ వైపునుండి చూస్తే తిరుసభ మానవ సమాజం. దానిలో అంతస్తులూ అధికారాలూ పరిపాలనమూ వున్నాయి. లోపాలూ పాపాలూ కూడ వున్నాయి. ఈ దృష్టితోజూస్తే అది మన కంటికి కన్పించేది, మనకు అర్థమయ్యేది. మన మానుష సంస్థల్లాంటిది. కాని మరోవైపునుంచి చూస్తే అది దేవుడు నెలకొల్పినన సమాజం. ఉత్థానక్రీస్తు ఆత్మ దానిలో వుండి దాన్ని నడిపిస్తూంటుంది. వరప్రసాదంవల్ల అది యేనాటికీ నాశమైపోదు. ఈ దృష్టితో జూస్తే అది మనకంటికి కన్పించేదీకాదు, మనకు అర్థమయ్యేదీకాదు. దైవశక్తితో నడచే దివ్యసంస్థ.

దైవసంస్థకూడ కనుకనే తిరుసభను దైవరహస్యం అన్నారు. దైవరహస్యం అంటే యేమిటి? ఏదైనా ఓ వేద సత్యం వుందనుకొందాం. అది మనంతట మనకు తెలియదు. బైబులుద్వారా తెలుస్తుంది. కాని బైబులుద్వారా తెలుసుకొన్నాకగూడ ఆ వేద సత్యం మనకు పూర్తిగా అర్థంకాదు. మన బుద్ధిశక్తి దాన్ని గ్రహించలేదు. దాన్ని మనం విశ్వాసంతో నమ్మవలసిందే. ఉదాహరణకు పరిశుద్ధతీత్ర్వం, క్రీస్తు మనుష్యావతారం దైవరహస్యాలు. తిరుసభకూడ ఈలాంటి దైవరహస్యమే. మనం దాని మానవస్వభావాన్నిగ్రహించగలమేకాని దివ్యస్వభావాన్ని గ్రహించలేం. దానిలోని దైవసాన్నిధ్యాన్ని ఆత్మశక్తినీ వరప్రసాదబలాన్నీ మనం పూర్తిగా అర్థంజేసికోలేం.

దేవుడు నరుడై జన్మించినపుడు ఆనాటి ప్రజలు అతని మానవత్వాన్ని గుర్తించారేకాని దైవత్వాన్ని గుర్తించలేదు. అలాగే నేడు మనం తిరుసభలోని మానవగుణాలను చూస్తామే కాని దైవగుణాలను చూడలేం. కనుక అది మనకు దైవరహస్యంగానే మిగిలిపోతుంది. మరి తిరుసభను అర్థంజేసికోవడం ఏలా?
బైబులూ ప్రాచీన వేదశాస్తులూకూడ తిరుసభలోని దైవరహస్యాన్ని తెలియజేయానికి కొన్ని వుపమానాలు వాడారు. వీటి సహాయంతో మనకు అర్థంకాని తిరుసభను కొంతవరకైనా అర్థంజేసికోవచ్చు. ఇవి నూరుదాకా వున్నాయి. వీటన్నిటినీ