పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కారణం ఏవ అన్నాడు. తప్పు ఆమెమీద మోపాడు-3,12. పాపానికి ముందు ఏవకు వ్యాధిబాధలు లేవు. కాని పాపానంతరం ఏవ ప్రసవవేదనకు గురైంది - 3,16, ఆదాము నొసటి చెమటోడ్చి రెక్కలకష్టం చేయవలసివచ్చింది - 3,16. తొలిపాపం వలన భూమికూడ శాపం పాలయింది. ఆది పైర్లకు మారుగా ముండ్ల తుప్పలను ఎదిగించింది - 3,17-18.

పాపానికి ముందు ఆదామేవలు దిగంబరులుగా వున్నా వారికి సిగ్గవేయలేదు. కాని పాపం తర్వాత సిగ్గు పుట్టింది. కనుక అత్తియాకులతో దిసమొలను కప్పకొన్నారు - 3,7. అనగా వారి నిష్కల్మషత్వం పోయింది. ఇంద్రియ వాంఛలు అదుపుతప్పాయి. ఈ యనర్దాలన్నీ కూడ పాపం వివాహదశలో తెచ్చిపెట్టిన దుష్పరిణామాలు.

ప్రార్థనా భావాలు

1. భార్యవలన భర్తపొందే తృప్తి

ఈసాకు రిబ్కాను వివాహమాడాడు. ఆమెను నిండు మనస్సుతో ప్రేమించాడు. తల్లియైన సార చనిపోయిన తరవాత ఈసాకునకు చాల దుఃఖము కలిగింది. అప్పడు రిబ్కా అతన్ని ఓదార్చింది. దానితో అతని దుఃఖం తీరిపోయింది. భార్యవలన భర్తపొందే తృప్తి ఇలాగుంటుంది- ఆది 24,67,

2 భర్తవలన భార్యపొందే సంతృప్తి

ఎల్కనా భార్య అన్న, ఆమెకు సంతానం కలగలేదు, ఓనాడు వాళ్లు షిలో దేవాలయానికి వెళ్ళారు. అన్నదేవాలయంలో ఓ మూల చతికిలపడి విలపించింది. అన్నం తినడం మానివేసింది. అది చూచి ఎల్కనా "అన్నా! నీకు ఈ విచారం దేనికి? నా ప్రేమ నీకు చాలదా? పదిమంది కొడుకులకంటెకూడ నేను నీకు ఎక్కువగాదా?" అన్నాడు. ఆ మాటలకు సంతృప్తిచెంది అన్న యింటికి వెళ్ళింది. ఆ మీదట వాళ్ళకు సమూవేలు పుట్టాడు. భర్త వలన భార్య యిలా సంతృప్తి చెందుతుంది - 1సమూ 1,8.

3. భార్యాస్తుతి

"ఉదయించే సూర్యుడు ఆకాశానికి అలంకారం
మంచి యిల్లాలు ఇంటికి అలంకారం
వెలిగే దీపం దీప స్తంభానికి అలంకారం \
చిరునవ్వు నవ్వే ముఖం భార్యకు అలంకారం.

సీరా 26,16-21.