పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. ఈ విషయాలన్నీ తెలిసికొన్నాక పై మత్తయి 16,17-19 వాక్యాలమిద వివరణ చూద్దాం. "యోహాను కుమారుడవైన సీమోను! నీవు ధన్యుడివి. నీకు ఈ విషయాన్నితెలియజేసింది పరలోకంలోని నా తండ్రేకాని, నీ సహజశక్తి కాదు" - 16,17. 16వ వాక్యంలో పేతురు, క్రీస్తు మెస్సీయా అనీ సజీవుడైన దేవుని కుమారుడనీ ప్రకటించాడు. ఈ సత్యాన్ని అతడు తన సహజ శక్తివలన గ్రహించలేదు. క్రీస్తు మెస్సీయా అని గ్రహించే వరాన్నిదేవుడే అతనికి దయచేసాడు. దేవుడు పేత్రుకి ఈ విశ్వాసాన్ని దయచేసి అతన్ని తిరుసభకు మూలస్తంభాన్ని చేసాడు.

"నీవు రాయిని (కేఫావి). ఈ రాతిమీద నేను నా తిరుసభను నిర్మిస్తాను" - 16,18. క్రీస్తు సీమోను పేరు పేత్రుగా మార్చాడని చెప్పాం. బైబుల్లో ఆయా వ్యక్తుల పేర్లు వాళ్లు చేసే పనిని సూచిస్తాయి. కొన్నిసార్లు దేవుడే నరులపేర్లు మారుస్తుంటాడు. ఆ నరులు ఆ విూదట ఓ ప్రత్యేకమైన కార్యాన్ని నిర్వహిస్తారు. ఉదాహరణకు, దేవుడు అబ్రాము పేరుని అబ్రాహాముగా మార్చాడు. అబ్రాము అంటే గొప్పవాడయిన తండ్రికి పుట్టినవాడని భావం. అబ్రాహామంటే చాల జాతులకు తండ్రి అని భావం, ఈలా పేరు మార్చాకనే అబ్రాహాము అనేక జాతులకు తండ్రి అయ్యాడు - ఆది 17,5. ఈ సంప్రదాయం ప్రకారం క్రీస్తు సీమోను పేరుని కేఫాగా మార్చాడు అంటే, అతనికి కొత్తపనినీ కొత్తబాధ్యతనీ ఆప్పజెప్పాడని భావం. ఇక్కడ క్రీస్తు సీమోనుకి ఆప్పజెప్పిన కొత్తపని అతడు నూత్న సమాజానికి అధిపతి కావడమే. ఈ నూత్న సమాజం తిరుసభే కనుక పేత్రు దానికి నాయకుడౌతాడు. ప్రబువు "ఈ రాతిమిూద నేను నా తిరుసభను నిర్మిస్తాను" అన్నాడు. అది నరమాత్రులు స్థాపించే సమాజం కాదు. క్రీస్తే దాన్ని నెలకొల్పాలి. క్రీస్తు దాన్ని ఇంకా నెలకొల్పలేదు. అతని వుత్ధానానంతరం ఆపని జరుగుతుంది.

"మరణ శక్తులు దాన్ని జయించలేవు" -16,18, (కొందరు నరకశక్తులు లేక పాతాళశక్తులు అని అనువదిస్తారు). మరణం ఈలోకానికి సంబంధించింది. కనుక ఈ లోకపు దుష్టశక్తులు పేత్రు అనే పునాదిమీద నిల్చిన తిరుసభ అనే భవనాన్ని నాశం చేయలేవు. అది యీ లోకంలో వున్నా ఇక్కడే క్రీస్తు ఉత్ధానశక్తిలో పాలు పంచుకొంటుంది. ఫలితార్థమేమిటంటే, తిరుసభ పునాది బలమైంది. ఏదుష్ట శక్తి దాన్ని కూలద్రోయలేదు. అది అజేయమైంది.

"నేను పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిస్తాను” - 16,19. ఇక్కడ తాళపు చెవులంటే సంపూర్ణాధికారం అని భావం. యెషయా 2219–22లో ప్రభువు ఎల్యాకిమకి రాజప్రాసాదం తాళపుచెవులు ఇచ్చాడు. అనగా ఎల్యాకిము ఆ ప్రసాదానికి సంపూర్ణాధికారి అయ్యాడని భావం. అలాగే ఇక్కడ క్రీస్తు తిరుసభమిద సంపూర్ణాధికారాన్ని దయచేసాడని.