పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"యేసువా! మీ మరణాన్ని ప్రకటిస్తాం. మీ వుత్తానాన్ని చాటుతాం. మీరు మరల వచ్చే వరకు వేచివుంటాం."

"మీ మరణంచేత మా మరణాన్ని ద్వంసంచేసి మీ వత్థానం చేత మాకు పునర్జీవాన్ని ప్రసాదించిన మా యేలినవారైన యేసువా! మీరు మహిమతో వేంచేసిరండి.”

'యేసువా! ఈ యప్పాన్ని భుజించిపుడెల్ల, ఈ పాత్రం నుండి పానం చేసినపుడెల్ల మీరు మరల వచ్చేవరకు మీ మరణాన్ని చాటుతాం."

ఈ ప్రకటనలు అన్నీ కూడ క్రీస్తుపాస్కను గుర్తుకి తెస్తాయి. ఈ ప్రకటనల ద్వారా మన శ్రమల్లో బలాన్ని పొందుతాం.

శ్రమలు వేదనలు ప్రపంచంలోని నరులందరికి వున్నాయి. ఈ శ్రమలు ఒక విధంగా క్రీస్తు శ్రమలతో కలుస్తాయి. క్రీస్తు లోకంలోని నరులందరి కొరకు చనిపోయాడు. కనుక అతని శ్రమలు మరణోత్థానాలు మనకు తెలియని రీతిలో నరులంలరినీ ప్రభావితం చేస్తాయి. పవిత్రాత్మే ఈ కార్యాన్ని సాధిస్తుంది. క్రీస్తు శ్రమల వల్ల లోకంలోని నరులు తమ శ్రమలను భరింపగల్లుతున్నారు. అవి పునీతమౌతున్నాయి. కాని క్రైస్తవులమైన మనం దివ్యసత్ర్పసాద బలిద్వారా క్రీస్తు శ్రమలనుండి ఎక్కువ ఫలితాన్ని పొందుతున్నాం.

ఓస్మార్ రొమేరో దక్షిణ అమెరికాలోని ఎల్సాల్వడోరులో ఆర్చిబిషప్ . ఆయన పేదల అభ్యుదయం కొరకు కృషిచేస్తుంటే సహించలేక, ధనిక క్రైస్తవవర్గం దేవాలయంలో పూజ చేస్తున్నపుడు ఆయన్ని కాల్చిచంపింది. తన మరణానికి ముందు రోమేరో “బలియైన క్రీస్తు శరీరం, ఆ ప్రభువు చిందించిన రక్తం మనకు జీవాన్ని ఇస్తాయి. అతనిలాగే మనంకూడ మన శరీరాలను సమర్పించి వేదనలకు బాధలకు గురికావాలి. దీనిద్వారా మన ప్రజలకు శాంతి, న్యాయం లభిస్తాయి" అని వాకొన్నాడు. ఆయన చెప్పినట్లే ఆయన మరణం సాల్వడోర్లో న్యాయాన్ని స్థాపించింది. ఈ బిషప్లాగే తూర్పు టిమోర్ దేశంలో బిషప్ కార్లోస్ బెల్లోగారుకూడ హింసలు అనుభవించి స్వాతంత్ర్యాన్ని సంపాదించారు.

ఇక, భారత దేశంలో పేదలు, గిరీజనులు దళితులు ఐన క్రైస్తవులు విశేషంగా హింసలకు గురౌతున్నారు. ఒరిస్సా, గుజరాతు, మధ్యప్రదేశ్, బీహారు రాష్ట్రాల్లోని దళిత క్రైస్తవులు చాలమంది బాధలు అనుభవించారు. పట్టణాల్లో వున్న మన ఇంగ్లీషు మీడియం స్కూళ్ళ ఆస్పత్రులుమాత్రం ఏ హింసలకు గురికావడంలేదు. ఐతే మనం ఈ సందర్భంలో "మీరు లోకానికి చెందినవారైతే లోకం మిమ్ము ప్రేమిస్తుంది” అన్న క్రీస్తు వాక్యాన్ని స్మరించుకోవాలి - యోహా15,19. క్రీస్తు సువార్తను విన్పించనిచోట క్రైస్తవులకు హింసలుండవు.