పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేదసాక్షులుగా మరణించారు. ఆ కాలపు వేదశాస్తి టెరూలియను "క్రైస్తవుల నెత్తురు తిరుసభకు నారుమడి" అని వ్రాసాడు. అనగా వేదసాక్షుల మరణం వల్ల చాలమంది రోమనులు క్రైస్తవ మతంలో చేరతారని భావం. ఈ వేదసాక్షులు మరణదినాన క్రైస్తవభక్తులు వారిని స్మరించు కొని ప్రార్థనలు చేసేవాళ్ళు. అదేవారి జన్మదినంగా గణింపబడింది. ఆ దినాన వాళ్ళు పరలోక జీవితానికి జన్మించారని భావం.

తొలిమూడు శతాబ్దాలు తిరుసభ హింసలు అనుభవించింది. ఆ కాలంలో చాలమంది క్రైస్తవులను సిలువవేసారు. వారి తలలు కొట్టించారు, వారిని నిలువన కాల్చి చంపారు. క్రూరమృగాలకు మేతగా వేసారు. ఐనా క్రైస్తవుల సంఖ్య పెరిగిందే గాని తరగలేదు. సత్ర్పసాద బలివాళ్లకు బలాన్నిచ్చింది. వాళ్ళు క్రీస్తుపట్ల అనంత విశ్వాసంతో, పరస్పర ప్రేమభావంతో, ఐక్యభావంతో జీవించారు. ధైర్యంతో శ్రమలను ఎదుర్కొన్నారు. క్రీస్తు మరణంతో ఏకమైతే అతని పునరుత్తానంతో కూడ ఏకమౌతామని నమ్మారు - రొమా 6,5.

4. 21వ శతాబ్దపు పాస్క

}}

20వ శతాబ్దంలో చాల వేద హింసలు జరిగాయి. కమ్యూనిస్టు రష్యా చాలమంది క్రైస్తవులను హింసించింది. ల్యాటిను అమెరికా కూడ చాలమంది క్రైస్తవులను బాధించింది. ఈ హింసల్లో చాలవరకు క్రైస్తవులే క్రైస్తవులను వేధించారు. క్రీస్తు తన్నుతాను ఒక్కసారే కల్వరిమీద బలిగా అర్పించుకొన్నాడు - హెబ్రే 9,12,26. కాని క్రైస్తవ భక్తులు ఆ ప్రభువుతో కలిసి పెక్కుసార్లు తమ్ముతాము బలిగా అర్పించుకొన్నారు. అతని మరణంతో కలిసి వాళ్ల మరణం కూడ అనేకులకు రక్షణ సాధనమైంది.

లోకమంతటా హింసలకు గురైన దివ్యసత్ర్పసాద సమాజాలు పాస్క పరమరహస్యాన్నితమ జీవితంలో ప్రతిబింబించుకొన్నాయి. క్రీస్తు బాధామయ సేవకుడు. శిష్యులకాళ్ళు కడిగిన గురువు. హింసలకు గురైన ప్రవక్త ప్రాణప్రదాతయైన విమోచకుడు. ఈ ప్రభువు హింసలకు గురైన వారిని ప్రభావితం చేసాడు. దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి అన్న ప్రభువు ఆజ్ఞ వారిని ప్రేరేపించింది. వాళ్లు రొట్టె విరిచినప్పుడే వాళ్ళ శరీరాలు కూడ విరిగిపోయాయి. వాళ్ళు పాత్రంనుండి పానం చేసినప్పుడే శ్రమలను గూడ పానం చేసారు.

పూజలో అప్పాన్ని క్రీస్తు శరీరంగా మార్చాక ఈ విధంగా విశ్వాస ప్రకటనం చేస్తాం.