పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవితం గడపారు. ఆస్తిపాస్తులు వస్తువులు అందరు ఉమ్మడిగా వాడుకొన్నారు. ఉన్నవాళ్ళు తమ సొత్తును లేనివాళ్ళతో పంచుకొన్నారు. వీళ్ళు పేదలు, వీళ్ళు ధనికులు అనే తారతమ్యం లేకుండా జీవించారు. దేవుణ్ణిస్తుతించారు. సంతోషంగా జీవించారు - అచ 2,44-47. ఇది నిజమైన సత్రసాదసమాజం.

ఆరోజుల్లో ఓవైపు పాస్క దాని ప్రతిరూపమైన దివ్యసత్ర్పసాద విందు జరుగుతూంటే, మరోవైపు వేదహింసలుకూడ చెలరేగాయి. పాస్మకూ హింసకూ విడదీయరాని సంబంధంవుంది. చాలమంది క్రీస్తు శిష్యులు భక్త సమాజంలో చేరడం జూచి కన్ను గుట్టి యూదులు క్రైస్తవులను హింసించారు. క్రీ.శ. 50 ప్రాంతంలో ఈ హింస బలంగా వుండేది.
కాని ఇంతకంటె బలమైంది రోమను ప్రభువులు పెట్టినహింస. 64 ప్రాంతంలో రోము తగలబడింది. దీనికి క్రైస్తవులే కారణమని నీరోచక్రవర్తి వారిని క్రూరంగా హింసించాడు. 81-96 మధ్యలో డొమీప్యను చక్రవర్తి నేనే దేవుణ్ణని ప్రకటించుకొన్నాడు. యూదులు క్రైస్తవులు మరో దేవుణ్ణి పూజిస్తున్నందున వారిని దారుణంగా చంపించాడు. ఈ కాలంలో హింసలకు గురైన క్రైస్తవులు క్రీస్తు శ్రమలనుండీ మరణంనుండీ శక్తిని పొందారు. లోకం నన్ను హింసిస్తే మిమ్మలను గూడ హింసిస్తుంది అనే ప్రభువు వాక్యం నుండి ప్రేరణం పొందారు - యోహా 15,20. దివ్యసత్రసాదబలినుండి శక్తిని పొంది ఉత్తాన క్రీస్తుతో ఐక్యమయ్యారు. తమలో తాము ఐక్యమయ్యారు.
150 ప్రాంతంలో వేదసాక్షిగా మరణించిన జస్టిన్ భక్తుడు దివ్యసత్ర్పసాద విందును విపులంగా వర్ణించాడు ఈ విందు భక్త సమాజాన్ని బలపరుస్తుంది. ఈ విందుకు హాజరుకాలేని రోగులకొరకు సత్ర్పసాదాన్ని వారియిండ్లకు తీసికొనిపోయేవాళ్ళ భక్తులు ఈ విందుకు హాజరైతే రోమను ప్రభువులు ఆగ్రహం చెందేవాళ్ళు. ఐనా అందరు ధైర్యంతో ఈ భోజనానికి విచ్చేసేవాళ్ళు. 165 ప్రాంతంలో సార్టీనియా పీఠాధిపతి మెలీటో ఈ విందును గూర్చి ప్రసంగించాడు. యూదులు గొర్రెపిల్లను వధించి పాస్క భోజనాన్ని భుజించిన సంఘటనం క్రీస్తునందు ఫలసిద్ధిని పొందిందని బోధించాడు.
ఈ కాలంలోనే వేదసాక్షులు అనే భక్తులు ప్రచారంలోకి వచ్చారు. 167లో స్మిర్నా బిషప్ పోలికార్స్ వేదసాక్షిగా మరణించాడు. ఆనాటి భక్తులు ఆయన మరణానికి క్రీస్తు మరణానికీ సామ్యం వుందన్నారు. క్రీస్తులాగే పోలికార్పు కూడ ఆత్మార్పణం చేసికొన్నాడు.
177 ప్రాంతంలో మార్కస్ ఔరేలియస్ అనే రోమను చక్రవర్తి క్రైస్తవులను మళ్ళా క్రూరంగా హింసించాడు. లియోను, వియన్నా నగరాల్లో చాలమంది క్రైస్తవులు