పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మొదటి భాగంలో పాస్క గొర్రెపిల్ల ఉదంతాన్ని చూచాం. దాని నెత్తురు యిస్రాయేలు ప్రజలను రక్షించింది. దాని మాంసం వారికి ఆహారమైంది. యోహాను సువిశేషం క్రీస్తుని పాస్క గొర్రెపిల్లనుగా చిత్రిస్తుంది. స్నాపక యోహాను క్రీస్తుని చూచి యిదిగో లోకం పాపాలను పరిహరించే గొర్రెపిల్ల అంటాడు - 1,29. పాస్క గొర్రెపిల్ల ఎముకలు విరగగొట్టకూడదు - నిర్ణ 12,46, సిలువమీద క్రీస్తు కాళ్ళ విరగగొట్టలేదు. కనుక ఈ ప్రవచనం అతని యందు నెరవేరిందని యోహాను పేర్కొన్నాడు - 19,36, ఇంకా ఆ రచయిత దర్శన గ్రంథంలో “వధింపబడిన గొర్రె పిల్లను సింహాసనం మధ్యలో చూచాను” అని వ్రాసాడు - 5,6. ఈ యాలోకాలన్నీ పాస్క గొర్రెపిల్ల క్రీస్తుకి చిహ్నంగా వుంటుందని తెలియజేస్తాయి.


క్రీస్తు పాస్క పండుగ జరిగేప్పడు యెరూషలేము వచ్చాడు. అతడూ శిష్యులూ కలసి అక్కడ పాస్క విందును భుజించారు. అతడు శిష్యులతో "నేను శ్రమలు అనుభవించడానికి ముందు మీతో కలసి ఈ పాస్మను భుజించాలని ఎంతో ఆశించాను” అన్నాడు — లూకా 22,15. పూర్వం పాస్క గొర్రెపిల్ల వధద్వారా యూదుల దాస్యం తీరిపోయింది. ఇప్పడు క్రీస్తు అనే పాస్క గొర్రెపిల్ల వధద్వారా మన పాపదాస్యం తొలగిపోయింది. యెరూషలేములోని పాస్క విందు చారిత్రకంగా జరిగిపోయిన అతని మరణ సంఘటనను జ్ఞప్తికి తెస్తుంది. ఈ విందే భావికాల ప్రజలకు పూజబలి ఐంది. ఈ సందర్భంలో ప్రభువు రొట్టె రసాలను ఉద్దేశించి ఇది నా శరీరం, ఇది నా రక్తం అన్నాడు. దీన్ని నా జ్ఞాపకార్ధం చేయండి అని ఆదేశించాడు. ఇదే నేటి మన పూజ, పూజబలి పాస్క విందే.

3. తొలినాటి క్రైస్తవుల పాస్క

క్రీస్తు మరణం వేదనతో కూడింది. భయంకరమైంది. ఫబోరమైంది. ఆ రోజుల్లో విప్లవకారులకు, దేశద్రోహులకు ఆలాంటి కరోర మరణం ప్రాప్తించేది. క్రీస్తు సిలువపై దుర్భరమైన శారీరక, మానసిక వేదనలను అనుభవించాడు. మరణ కాలంలో శిష్యులు అతన్ని విడనాడారు. తండ్రికూడ అతన్ని విడనాడాడు అన్పించింది. యెషయా ప్రవచనం అతనిపట్ల పూర్తిగా నెరవేరింది. “అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయ్యాడు. నరులు అతనివైపు చూడ్డానికిగూడ ఇష్టపడలేదు. జనులు అతన్ని తిరస్కరించడంచే మనం అతన్ని లెక్కచేయలేదు" - 53,3.

ఆ రోజుల్లో యూదులు సిలువ మరణాన్ని నీచాతి నీచమైనదాన్నిగా గణించారు. ద్వితీయోపదేశకాండం సిలువ చేయబడినవాడు శాపగ్రస్తుడు అంటుంది - 21,23, గల