పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డదిపురుషులే చేస్తారు. స్త్రీల మాట చెల్లదు. ఇది అన్యాయం. క్రీస్తు స్త్రీ పురుషులకు సమానమైన విలువనిచ్చాడు. అతని శిష్యవర్గంలో స్త్రీలు కూడా వున్నారు. ప్రభువు వుత్తానాన్ని మొదట మగశిష్యులకు తెలియజేసింది స్త్రీలే. ఈ విషయాలన్నీ మరచిపోయి తిరుసభ క్రమేణ స్త్రీలను అణగదొక్కింది. నేడు క్రైస్తవ సమాజంలో స్త్రీలకు ఉచితస్థానం ఈయమని సత్రసాదం మనలను హెచ్చరిస్తుంది.

5. దివ్యవిందు మన విచారణను దైవరాజ్యంగా మార్చాలి. మనం మన విచారణ ప్రజల అగచాట్లను తొలగించగలిగి వుండాలి. అన్యాయాలనూ, పక్షపాతాలనూ నిర్మూలించాలి. ఆదిమ క్రైస్తవులు గృహాన్నే దేవాలయంగా భావించేవాళ్ళు. విచారణనే దైవరాజ్యంగా ఎంచేవాళ్ళ దైవరాజ్యం తెచ్చిపెట్టే సౌభాగ్యాలను విచారణ అంతా కలసి అనుభవించాలని కోరుకొనేవాళ్ళ నేడు సత్రసాదం ఈ యాశయాలన్నిటినే నెరవేర్చాలి. 6. తరచుగా మనం విచారణ అంటే క్రైస్తవ కుటుంబాలు మాత్రమే అనుకొంటాం. కాని ఇది పొరపాటు. మనం ఇతరులనుండి విడిపోయి ఏకాంతంగా జీవించేవాళ్ళం కాదు. మన చుటూ వున్న హిందువులు మహ్మదీయులు మొదలైనవాళ్లు కూడ మన విచారణ క్రిందికే వస్తారు. వారికి కూడ మనం క్రీస్తుబోధలను తెలియజేయాలి. అతని ప్రేమను వారు కూడ గ్రహించేలా చేయాలి. మన తరపున మనం ప్రేమతోను, మన సౌత్తును ఇతరులతో పంచుకొనే మనస్తత్వంతోను జీవిస్తూ క్రైస్తవేతరులకు ఆదర్శంగా వుండాలి. సత్రసాదం మనలను కూడ క్రీస్తులాగే ఆత్మదానానికి పరికొల్పాలి.

పర్యవసానం

దివ్యసత్రసాద శక్తి అనంతమైంది. క్రీస్తు తన మరణితానాల శక్తిని దానిలోకిని ప్రవేశపెట్టాడు. దాని ద్వారానే దైవరాజ్యాన్ని నెలకొల్పాడు. ఆదిమ క్రైస్తవులకు ఈ సూత్రం బాగా తెలుసు. వాళ్ళ సత్రసాద బలంతోనే మహాబల సమన్వితమైన రోమను సామ్రాజ్యాన్ని జయించారు. ఆ దివ్యభోజన బలంతోనే వేదసాక్షులుగా మరణించారు. ఆ దివ్యశక్తితోనే అన్యమతాలవాళ్ళను క్రీస్తు శిష్యులనుగా జేసారు. భారతదేశంలో ఈ సత్రసాద శక్తి ఇంకా కన్పించడంలేదు. దురదృష్టవశాత్తు మనం దాన్ని కొన్ని తంతులతో గూడిన కర్మకాండగా మార్చివేసాం. దానిలోని ఆత్మశక్తి పూర్తిగా మరుగుపడిపోయింది. నేడు మన విచారణల్లో,మౌలిక సంఘాల్లో -38 దివ్యభోజనశక్తి మళ్ళ ప్రస్ఫుటంగా కన్పించాలి. మనం ఆదివార సత్రసాదబలిలో యోగ్యంగా పాల్గొంటే నూత్న సమాజాన్ని సృజించవచ్చు నేడు మన దేశానికి కావలసింది శస్త్రఙనంతొ నిండిన సమాజాలూ పరిశ్రమలతో గూడిన సమాజాలూ మాత్రమే కాదు. పరస్పరం ప్రేమించడం, పరస్పరం పంచుకోవడం అనే దొడ్డ గుణాలతో నిండిన సమాజాలు కూడ అవసరమే. కాని వారంవారం క్రీస్తు ప్రేమనూ ఆత్మదానాన్ని సత్రసాదంలో చవిజూచిన వాళ్ళేగాని ఈ నూత్న సమాజాలను స్థాపించలేరు. సత్రసాదంవల్ల మార్పుచెందిన విచారణలు ఈ దేశాన్ని క్రమంగా మార్చివేస్తాయి.