పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. సత్ప్రసాదం విసిరే సవాళ్ళ

దివ్యభోజనం మనకు చాల సవాళ్ళను విసురుతుంది. ప్రస్తుతానికి కొన్నిటిని పరిశీలిద్దాం.

1. సంఘభావం. ఓవైపు శాస్త్రాన్వేషణలు, సమాచార సాధనాలు ప్రపంచా న్నంతటినీ ఏకగ్రామంగా మార్చివేస్తున్నాయి. ప్రపంచంలో ఒక మూలన జరిగే విషయాలను మరో మూలన త్వరితగతిలో తెలిసికోగల్లుతున్నాం. ఐనా మనకు వ్యక్తిభావం పోలేదు. ఇతరులతో కలియకుండ మనకు మనంగా వంటరిగా వుండిపోతున్నాం. ఆదివార సత్రసాదబలి మనం కేవలం వ్యక్తులంగాదు, సంఘానిమి అనేభావాన్ని కలిగించాలి. ఈ దివ్యబలి భక్తసమాజాలను సృజించగలిగి వుండాలి. పూర్వం యిస్రాయేలు ప్రజల్లాగే ఇప్పడు క్రైస్తవ ప్రజకూడ వ్యక్తిగతంగా గాక సమాజంగానే రక్షణాన్ని పొందాలి.

2. వ్యక్తి శ్రేయస్సు - సంఘశ్రేయస్సు, స్వార్థపరులకు వ్యక్తి శ్రేయస్సే ముఖ్యం.వాళ్ళు ఇతరులతో పోటీకి దిగి ధనార్ధనం చేస్తుంటారు. జీవితంలో ఎన్ని వస్తువులను వాడుకొంటే అంత గొప్ప అనుకొంటారు. పేదలు ఎప్పటికి పేదలుగానే వుండిపోవాలని కోరుకొంటారు. అన్యాయాలకూ అక్రమాలకూ వొడిగడుతుంటారు. దుర్భలులను అణగదొక్కుతుంటారు. ఈలాంటి పరిస్థితుల్లో దివ్యసత్రసాదం మనకు సంఘశ్రేయస్సు ముఖ్యమనే భావాన్ని కలిగించాలి. నరునికి ఆత్మదానం అనే విలువను నేర్పాలి. స్వార్ధలాభాన్ని వదలుకొని మన సౌమ్మను ఇతరులతో పంచుకోవడం అవసరమనే భావాన్ని కలిగించాలి. "నా చిన్ని బొజ్ఞకు శ్రీరామరక్ష' అనే భావాన్ని రూపుమాపాలి.

3. మనదేశంలో కులాలు, వర్గాలు, భాషలు, ప్రాంతాలు, మతాలు మొదలైనవి ప్రజలను విభజిస్తున్నాయి. ఈ విభజనలు పోయి మనమందరం ఏక సమాజంగా, ఏక కుటుంబంగా ఐక్యం గావాలి. క్రీస్తు మనకు పరలోకంలో ఒకే తండ్రి వున్నాడనీ, అతని సంతానానిమైన మన మందరమూ ఏకకుటుంబమనీ బోధించాడు. సత్రసాదం మనం ఈ సూత్రాన్ని బాగా జీర్ణం జేసికొనేలా చేయాలి. అసలు క్రైస్తవుల్లోనే కులాలు వర్గాలు వున్నాయి. ఒక కులంవాళ్ళు మరో కులంవారిని అంగీకరించరు. మన గుళ్ళల్లో అగ్రకులాలకు ఒక తావూ, నిమ్నకులాలకు వేరొక తావూ కేటాయిస్తున్నారు. సమాధుల దొద్దిలో గూడు చిన్నకులాలవారికి మారుమూలతావ కేటాయిస్తున్నారు. నరులు చనిపోయాక గూడ కులాన్ని వెంటదీసికొని పోతారా? క్రైస్తవుల్లో గూడ కొందరిని అంటరాని వారినిగా భావిస్తున్నారు. వారికొక క్రీస్తు, ఇతరులకు ఇంకొక క్రీస్తు వున్నాడా? దివ్యవిందు ఈ యంతరాలన్నిటినీ తొలగించి మనలను ఏక సమాజంగా ఐక్యం జేయాలి. 4. ఇంకా మనం స్త్రీలపట్ల వివక్ష చూపుతున్నాం. మన తిరుసభలో పురుషులకున్న గౌరవం స్త్రీలకు లేదు. తిరుసభలో వాళ్ళ పెద్ద పదవులను పొందలేరు. పెద్ద నిర్ణయాలన్ని