పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోవాలి. ప్రభువు శిష్యుల్లో యూదుడు అన్యజాతివాడు, బానిస స్వతంత్రుడు, పురుషుడు స్త్రీ అనే అంతరాలు గతించాలి - గల 3.28. సోదరప్రేమ పెరగాలి. సత్రసాదం మనలను ఏక ప్రజను చేస్తుంది. "ఒకే రొట్టెలో పాలు పంచుకొన్న మనమందరం ఏక శరీరమౌతాం” - 1 కొరి 10,17. అనగా ఈ దివ్యభోజనం మనలను ఏక సమాజంగా ఐక్యం జేస్తుంది. తోడి నరులను అంగీకరించడం ద్వారా మనం దేవుణ్ణి చేరుకొంటాం. కనుక ఇప్పడు నేరుగా దేవుణ్ణి పూజించడం, నేరుగా దేవుణ్ణి చేరడం అనేవి కుదరవు. క్రీస్తు మనుష్యావతారమూ, అతడు మానవులకోసం చనిపోవడం, ప్రేమ పూర్వకమైన సత్రసాదాన్ని స్థాపించడం మొదలైన దైవరహస్యాలన్నీ మనం సంఘిభావంతో, సహకారభావంతో జీవించాలని హెచ్చరిస్తాయి.

8. సత్ప్రసాద ఫలితాలు

సత్ప్రసాదాన్ని యోగ్యంగా స్వీకరిస్తే ఈ క్రింది ఫలితాలు కలుగుతాయి. 1. మొదట ప్రజలను దివ్యసత్రసాద స్వీకరణకు సిద్ధం చేయాలి. గురువు ఇచ్చే ప్రసంగాలు ప్రజలు ఈ సంస్కార భావాన్ని చక్కగా అర్ధం జేసికోవడానికి ఉపయోగపడేలా వండాలి. ఇంకా, భక్తులు మంచి పాపసంకీర్తనం ద్వారా ఈ భోజనాన్ని యోగ్యంగా స్వీకరించడానికి తయారు కావాలి. ఈ పాపసంకీర్తనం ఓ తంతు, కర్మకాండ కాకూడదు. ఎప్పడు గూడ ప్రభుని పవిత్ర హృదయంతో స్వీకరించాలి. పూజ భక్తిమంతంగా వుంటే విశ్వాసులు దానిలో శ్రద్ధతో పాల్గొంటారు. మనం పాడే సత్ప్రసాద గీతాలు కూడ ప్రజలకు ఆ దివ్యభోజనం పట్ల భక్తిని పుట్టించేలా వండాలి. 2. ప్రజలు కేవలం ఆదివారం అప్పు తీర్చుకోవడానికి మాత్రమే గుడికి రాకూడదు. విచారణలోని ప్రజలంతా ఓ ప్రేమ సమాజంగా ఆదివారం గుడిలో ప్రోగుగావాలి. వాళ్ళు ఒకరి నొకరు కలసికోవాలి, అంగీకరించాలి. ఆరాధనకు ప్రోగైనవాళ్ళు ఈ గుంపులో నేనూ వొకట్టి అన్నట్లుగా వుండిపోగూడదు. ఒకరితో ఒకరు సఖ్యసంబంధాలు పెంపొందించుకోవాలి. క్రీస్తు మన మధ్యలోకి వచ్చి ప్రేమతో మనతో కలసిపోయాడు. అతని ప్రేమకు ఇప్పడు మనం సాక్షులం. కాని నేడు మనం ఒకరిపట్ల ఒకరం చూపుకొనే ప్రేమద్వారానే ఈ సాక్ష్యం వెల్లడికావాలి. దివ్యసత్ప్రసాద బలి భక్త సమాజమంతా కలసి ప్రేమ భావంతో సమర్పించేది. 8. ఆదిమ క్రైస్తవ సమాజంలో భక్తులు పూజకు తమ కానుకలను తీసికొని వచ్చేవాళ్ళు, రొట్టె రసాలు కూడ ఈ కానుకల్లో భాగమే. అర్పణ సమయంలో వీటిని దేవునికి అర్పించేవాళ్ళు. పూజానంతరం ఈ కానుకలను పేదలకు మంచిపెట్టేవాళ్ళు ఈ విధంగా ఉన్నవాళ్ళు లేనివాళ్ళతో తమ సొత్తును పంచుకొనేవాళ్ళు.