పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రేమననుసరించి సోదరప్రేమ, పరస్పర సహాయం అనే సూత్రాలను పాటించాలి. ఈ నియమాలను పాటించనివారిని ఆ తొలిరోజుల్లో పౌలు భక్తుడే నిందించాడు - 1కొరి 11.21. ఆ రోజుల్లో సోదరప్రేమకు గురుతుగా శనివారం రాత్రి భక్తులందరూ కలసి మొదట మామూలు భోజనాన్ని ఉమ్మడిగా భుజించేవాళ్ళు దీన్ని “ఆగపే" అన్నారు. అనగా ప్రేమ భోజనం అని భావం. ఆ పిమ్మట దివ్య భోజనాన్ని భుజించారు. ఈ భోజనాలు రెండు ఆనాటి క్రైస్తవులను ఐక్యపరిచాయి. వాళ్ళు తమ సొమ్మును ఒకరితో ఒకరు పంచుకొనేలా చేసాయి.

క్రమేణ మధ్యయుగాల్లొ ఈ భావం మరుగుపడి పోయింది. క్రైస్తవులు సత్ర్పసాదంలో సోదర ప్రేమను విస్మరించి దైవప్రేమను మాత్రం నిల్పుకొన్నారు. ఆది సమసమాజాన్నిస్థాపిస్తుందన్న విషయాన్ని మరచిపోయి దేవుణ్ణి ఆరాధించి పూజించడానికే ఉపయోగపడుతుందని భావించారు.

పౌలు భక్తుడు మనం క్రీస్తు విచ్చేసిందాకా ఈ దివ్యసత్ర్పసాదం ద్వారా అతని మరణికోత్తాలను ప్రకటిస్తామన్నాడు - 1కొ 11,26. తొలినాటి క్రైస్తవులు ఈ రెండవ రాకడ తమ జీవిత కాలంలోనే జరుగుతుందనుకొన్నారు. ఉత్థాన క్రీస్తు ఆనాటి $ର୍ତ సమాజంలోనికి విచ్చేసి దాన్ని బలపరచి పరిపూర్ణం చేస్తాడనుకొన్నారు. వాళ్ళు కోరుకొన్నట్లుగానే ప్రభువు ఆనాటి క్రైస్తవులను ఉత్తేజపరచాడు.

వాళ్ళు పరస్పర ప్రేమతో సహాయభావంతో జీవించేలా చేసాడు. కాని మధ్యయుగాల్లోని క్రైస్తవులు ఈ పౌలు భావాన్ని మరోలా అర్థంజేసికొన్నారు. క్రీస్తు రెండవ-రాకడ ఎప్పడో లోకాంతంలో జరుగుతుంది అనుకొన్నారు. సత్ర్పసాదానికీ సోదర ప్రేమకూ వున్న సంబంధాన్ని విస్మరించారు.

ఇందుకే రెండవ వాటికన్ మహాసభ ఈ దివ్యభోజనం ద్వారా మన సోదర ప్రేమ పెరగాలనీ, సమసమాజ స్థాపన జరగాలనీ నొక్కిచెప్పింది. స్వార్థం పెరిగిపోయి ధనికవర్గం పేదలను అణగదొక్కే ఈ కాలంలో సత్రసాద స్వీకరణం సోదర ప్రేమను పెంచాలి. ఉన్నవాళ్ళ లేనివాళ్ళను అడుకొనేలా చేయాలి. క్రీస్తు తన మరణోత్తానాల ద్వారా తన ప్రేమను మనకు నిరూపించాడు. ఈనాడు ఈ విందు ద్వారా మనం మన ప్రేమను తోడి జనానికి చూపించగలిగి వుండాలి. అప్పడే తండ్రిప్రేమా క్రీస్తుప్రేమా మనలో వేరు పాతుకొనేది

7. సత్ర్పసాదమూ నూత్న సమాజ స్థాపనం

క్రైస్తవులు కొలిచే దేవుడు నరులను ప్రేమించి నరలోకంలోకి దిగివచ్చాడు. నరుల మధ్య వసించాడు. నరుల కోసం చనిపోయి మళ్ళా ఉళితుడయ్యాడు. తాను