పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్వీకరించేపుడు పెద్ద కులాలవాళ్ళ ఒక బృందంగా వస్తారు. దళితులు ఇంకొక బృందంగా వస్తారు. అసలు వాళ్ళు వీళ్ళ దేవాలయంలో వేరువేరు తావుల్లో కూర్చుంటారు. ఈలాచేస్తే మనం ఆదిమ క్రైస్తవ సమాజంలో వున్న సమానత్వాన్ని పూర్తిగా మర్చిపోయినట్లే గదా? ఈలా కులభావం మన ఆరాధనను కలుషితం చేస్తూంది. ఇంక సత్రసాద స్వీకరణకు వచ్చే ధనికవర్గం పేద వర్గాన్ని ఏమాత్రం పట్టించుకోదు. మీరు వేరు మేము వేరు అన్నట్లుగా వుంటుంది వారి మనస్తత్వం, సత్రసాదం మనలను దేవునితోను తోడినరులతోను ఐక్యం జేసినపుడే దాని ప్రయోజనం నెరవేరేది.

5. రెండవ వాటికన్ మహాసభ తర్వాత

రెండవ వాటికన్ సభ సత్ర్పసాదాన్ని అర్థంజేసికొనే విధానంలో చాల మార్పులు తెచ్చింది. ఈ సభ బోధలు ఇవి. 1. సత్ర్పసాదం క్రైస్తవ సమాజమంతా కలసి దేవుని ఆరాధించే సాధనం. కనుక గురువుతో పాటు గృహస్థలు కూడ ఆ యారాధనలో పాల్గొనాలి.

2. ఈ దివ్య భోజనాన్ని ఆరాధించి భుజించే వారిలో పరస్పర ప్రేమ, పరస్పరం సహాయం చేసికోవడం అనే గుణాలు కన్పించాలి.

ఈ మార్పులతోపాటు వాటికన్ సభ సత్రసాద ఆరాధనకు చెందిన తంతులో కూడ కొన్ని మార్పులు చేసింది. కాని ఈ సభ ముగిసాక క్రైస్తవులు పై తరతుకు చెందిన మార్పులను మాత్రం స్వీకరించారు. సత్రసాద అర్ధానికి చెందిన మార్పులను స్వీకరించనే లేదు. కనుక సోదరప్రేమ పరస్పర సహాయం అనే విషయాల్లో మనం పూర్వం ఎక్కడున్నామో ఇప్పడూ అక్కడే వున్నాం. ఇప్పటి మన సమాజంలో కులతత్వాలు, ఆర్థిక అసమానతలు, దురాశ, పరపీడనం, పేదరికం మొదలైన అవలక్షణాలు రాజ్యమేలుతున్నాయి. ఈ దుర్గుణాలన్నీ మనలను విభజిస్తున్నాయే గాని ఐక్యం జేయడం లేదు. సత్రసాదం ఈ యవలక్షణాలను అణచి వేయలేకపోతూంది.

ఇప్పడు భారతదేశానికి కావలసింది ఏవేవో నియమాలతో, తంతులతో కూడిన నూత్న మతం గాదు, సోదరప్రేమ, పరస్పర సహాయాలతో గూడిన (š’š ќбsбл°aso. సత్రసాదం మాత్రమే ఈలాంటి సమాజాన్ని సృజించగలదు. ఇక దివ్య భోజనం ద్వారా నూత్న సమాజ స్థాపనం ఏలా జరగాలో కొంచెం విపులంగా పరిశీలిద్దాం.

6. సత్ర్పసాద భావంలో మార్పు

దివ్య సత్ర్పసాదాన్ని ఆరాధించాలంటే మొదట జ్ఞానస్నానం పొందిన క్రైస్తవ సమాజం వుండాలి. ఈ సమాజంలో "దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి" అన్న క్రీస్తు ఆజ్ఞననుసరించి సత్ర్పసాదాన్ని ఆరాధించాలి, భుజించాలి. ఈ సమాజం క్రీస్తు